బీఫ్ తింటానని నేను ధైర్యంగా చెబుతా..ఆ మాట చెప్పే ధైర్యం మీకుందా?

Karnataka : ‘I eat cattle meat, who are you to ask,’ Siddaramaiah : ‘‘నేను గొడ్డు మాంసం తింటానని నేను ధైర్యంగా చెబుతా..ఆ మాట చెప్పే ధైర్యం మీకుందా? అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సవాల్ తోడి కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. కర్ణాటకలో ఇటీవలకాలంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నాయకులు స్పందించటంలేదంటూ సోమవారం (డిసెంబర్ 28,2020) కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తంచేస్తూ..ఈ వ్యాఖ్యలు చేశారు.
కొన్ని అంశాలపై మాట్లాడడంలో కాంగ్రెస్ నాయకులు ధైర్యం చూపించలేకపోతున్నారని గోవధ బిల్లును దృష్టిలో పెట్టుకుని సిద్దరామయ్య మాట్లాడుతూ తోటి కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పలుఅంశాలపై కాంగ్రెస్ నేతలు స్పందించటంలో విఫలమయ్యారని ఆయన అసహనం ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సిద్ధరామయ్య తాను గొడ్డుమాంసం తింటానని గతంలో చెప్పాను..ఇప్పుడు చెబుతున్నాను. ఇక ముందు కూడా చెబుతాని..ఈ మాటలు నేను ధైర్యంగా చెప్పగలనని, నేను చెప్పినంత ధైర్యంగా మీరు చెప్పగలరా? అంటూ సహచర కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
నేను బీఫ్ తింటానని నేను అసెంబ్లీలోనే.. చెప్పాను. నేను బీఫ్ తింటాను, అడగడానికి మీరెవరని చట్టసభలోనే గద్దించాను. నేను ఏం తినాలనేది నా ఇష్టం..ఏది తినాలనేది నా ఇష్టం. ఇది నా హక్కు..దాన్ని ప్రశ్నించే అధికారం మీకెక్కడిదని నిలదీశాను. మీకిష్టంలేకుంటే మీరు తినొద్దు అలాగని ఇతరులు తినకూడదని మీరెలా చెబుతారని..నాకు బీఫ్ అంటే ఇష్టం కాబట్టే తింటున్నాను… ఇలా మీరు చెప్పగలరా? అంటూ సిద్ధరామయ్య కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు భయపడి పలు అంశాలపై మాట్లాడడంలేదని..కనీసం తమ అభిప్రాయాలను కూడా చెప్పలేకపోతున్నారని..అటువంటివారు రాజకీయాల్లో ఎలా ఉండగలుగుతారని ప్రశ్నించారు. ఇటువంటి గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రండి..ధైర్యంగా ప్రశ్నించండి అంటూ సూచించారు. గోవధ వ్యతిరేక బిల్లును దృష్టిలో ఉంచుకుని సిద్దరామయ్య ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.