Bengaluru Floods: బెంగళూరు కుండపోతపై సీఎం అత్యవసర సమీక్ష.. ఏమీ పట్టనట్లు నిద్రపోయిన మంత్రి

బీజేపీ నేత తేజస్వీ సూర్యపై సైతం కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. తేజస్వీ సూర్య ఇంట్లో దోస తింటున్న వీడియో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఒక పక్క బెంగళూరు మునిగిపోతుంటే సూర్య మాత్రం మంచి బ్రేక్‮‭ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. వరదలో మునిగిన ఒక్క ప్రాంతాన్నైనా ఈయన సందర్శించారా?’’ అంటూ ట్వీట్ చేశారు. ఒక ఇన్‭గ్రామ్ రీల్ చూసిన అనంతరం.. దోస తినేందుకు ఇలా సిద్ధమైనట్లు సదరు వీడియోలో సూర్య చెప్తుండడం విశేషం.

Bengaluru Floods: కర్ణాటక రాష్ట్రాన్ని వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. ఇక ఇండియన్ సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరు అయితే చిగురుటాకులా వణుకుతోంది. ఎటు చూసినా వరదే.. ఎక్కడ చూసినా వర్షపు నీరే. ఆదివారం అర్థరాత్రంతా కురిసిన కుండపోతకు నగరం సరస్సులా మారింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే నగరం ముఖచిత్రం మారిపోయింది. సిలికాన్ వ్యాలీ కాస్తా చిత్తడిచిత్తడిగా మారిపోయింది. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆర్.అధోక.. సమావేశం కొనసాగుతున్నంత సేపు హాయిగా నిద్రపోయారు.

బెంగళూరు‌కు వరద సహాయక చర్యల కోసం రూ.300 కోట్లు విడుదల

ఒక పక్క రాజధాని వరదలో కొట్టుకుపోతుందని అధికారులతో, మంత్రులతో ముఖ్యమంత్రి వాడీవేడి చర్చ జరుపుతుంటే.. మంత్రికి అదేమీ పట్టనట్టు కునుకు తీశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావడంతో మంత్రిపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష కాంగ్రెస్ పార్టీకి ఇది వజ్రాయుధంలా దొరికింది. సమీపక్షలో నిద్రపోతున్న మంత్రి ఫొటోను కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘మునకలు చాలా రకాలు. రాష్ట్ర ప్రజలు వర్షాల్లో మునిగిపోతున్నారు. మంత్రి నిద్రలో మునుగుతున్నారు’’ అని విమర్శలు గుప్పించింది. నెటిజెన్లు సైతం ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

Bengaluru Floods: బెంగళూరు వరదలకు కాంగ్రెసే కారణమట.. కర్ణాటక సీఎం బొమ్మై విమర్శలు

ఇక మరో బీజేపీ నేత తేజస్వీ సూర్యపై సైతం కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. తేజస్వీ సూర్య ఇంట్లో దోస తింటున్న వీడియో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఒక పక్క బెంగళూరు మునిగిపోతుంటే సూర్య మాత్రం మంచి బ్రేక్‮‭ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. వరదలో మునిగిన ఒక్క ప్రాంతాన్నైనా ఈయన సందర్శించారా?’’ అంటూ ట్వీట్ చేశారు. ఒక ఇన్‭గ్రామ్ రీల్ చూసిన అనంతరం.. దోస తినేందుకు ఇలా సిద్ధమైనట్లు సదరు వీడియోలో సూర్య చెప్తుండడం విశేషం.

Gujarat Polls 2022: ఎమ్మెల్యే టికెట్లలో మహిళలు, యువతకు ప్రాధాన్యం.. కాంగ్రెస్ కీలక ప్రకటన

ట్రెండింగ్ వార్తలు