Prisoners Cellphone: జైల్లో సెల్ ఫోన్ వాడుతూ పట్టుబడే ఖైదీలకు శిక్ష పెంచనున్న కర్ణాటక రాష్ట్రం

జైల్లో సెల్‌ఫోన్లు వాడుతూ పట్టుబడిన ఖైదీలకు మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1963 నాటి కర్ణాటక జైళ్ల చట్టాన్ని సవరించారు

Prisoners Cellphone: జైల్లో సెల్‌ఫోన్లు వాడుతూ పట్టుబడిన ఖైదీలకు మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 1963 నాటి కర్ణాటక జైళ్ల చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. జైలులో ఖైదీలు సెల్ ఫోన్ మాట్లాడుతున్న దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయగా..కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈసందర్భంగా కర్ణాటక న్యాయశాఖ మరియు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి జేసీ మధుస్వామి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీలు విచ్చలవిడిగా సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని అన్నారు. పేరోల్ పై వెళ్లే ఖైదీలు తిరిగి రావడం లేదని.. ఇటువంటి అన్ని అంశాలను పరిశీలించినమీదట కర్ణాటక జైళ్ల చట్టాన్ని కఠినతరం చేసినట్లు మంత్రి జేసీ మధుస్వామి వివరించారు.

Also Read:Surajkund Crafts Mela: రెండేళ్ల అనంతరం ప్రారంభమైన “సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా”

1963 నాటి కర్ణాటక జైళ్ల చట్టంలోని సెక్షన్ 42లో పేర్కొన్న విధంగా జైలులో నిషేదించిన ఏదైనా వస్తువులతో ఖైదీలు పట్టుబడితే ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం సవరించిన చట్టం ప్రకారం..నిషేదిత జాబితాలో మొబైల్స్ ఇతర సమాచారంచేరవేసే పరికరాలను చేర్చారు. శిక్షను కూడా ఆరు నెలల నుంచి మూడేళ్లకు పెంచారు. ఇక చట్టంలోని 57 ప్రకారం పేరోల్ పై వెళ్లిన ఖైదీలు తిరిగి జైలుకు తిరిగిరాని పక్షంలో ప్రకటిత నేరస్థుడిగా పరిగణించనున్నారు. ఖైదీతో పాటు అతనికి ష్యూరిటీగా నిలిచిన బాండ్లను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసుకుంటుంది. జప్తు చేయబడిన బాండ్ మొత్తాన్ని భూఆదాయ బకాయిలుగా రికవరీ చేస్తారు. పేరోల్ పై వెళ్లిన ఖైదీ తిరిగి లొంగిపోవడానికి విఫలమైన పక్షంలో మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Also read:Lalu Prasad Health: మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం: రిమ్స్ నుంచి ఎయిమ్స్ కి తరలింపు

ట్రెండింగ్ వార్తలు