Karnataka Election: 25 ఏళ్లలో రెండు సార్లే స్పష్టమైన తీర్పునిచ్చిన కన్నడ ఓటర్లు.. ఈసారి జేడీఎస్ ఆశలు ఫలిస్తాయా?

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పగ్గాలు దక్కించుకోవాలంటే 113 సీట్లు గెలుచుకోవాలి. అయితే, ఈసారి ఏదైనా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందా? మరోసారి హంగ్ ఏర్పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

Karnataka Election: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడు పార్టీల అగ్రనేతలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీ అభ్యర్థుల విజయంకోసం కృషిచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఆదివారంసైతం పలు ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లిఖర్జున్ ఖర్గే లతో పాటు ఇతర సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తున్నారు.

Karnataka Election 2023: ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే.. తుది అంకానికి చేరిన ఎన్నికల ప్రచారం..

ఎన్నికల దగ్గర పడుతున్నా కొద్దీ కన్నడనాట తీర్పుపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారైనా స్పష్టమైన మెజార్టీ వస్తుందా? మళ్లీ హంగే వస్తుందా? అనే అంశం తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఎన్నికల నగారా మోగిన సమయానికి రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేఖత కనిపించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు భావిస్తూ వచ్చారు. అయితే, ప్రచార పర్వం మొదలైన తరువాత, ఇరు పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేసిన తరువాత ప్రజల్లో బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత తగ్గుతున్నట్లు కనిపిస్తోందని పలు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి.

Karnataka Elections: ప్రధాని ‘జై బజరంగ్ బలి’ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌నూ వదల్లేదు..

ప్రభుత్వంపై అవినీతి ముద్ర, లింగాయత వర్గంలో అసంతృప్తి బీజేపీ అధిష్టానాన్ని మొదట్లో కొంత కలవరానికి గురిచేసింది. ఎన్నికల ప్రచారపర్వం మొదలు కావటం, కాంగ్రెస్, బీజేపీలు మేనిఫెస్టోలు విడుదల చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టిందనే వాదన ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంటుంది. ప్రధాని మోదీసైతం బహిరంగ సభల్లో బజరంగ్ బలి నినాదాన్ని వినిపిస్తు హిందుత్వ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

karnataka election 2023 : ప్రధాని మోదీ చుట్టూ కన్నడ రాజకీయాలు .. మోదీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంగా మారిన ఎన్నికలు

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫింగర్‌‌కు చేరుకోవాలంటే 113 సీట్లు గెలుచుకోవాలి. అయితే, ఈసారికూడా రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజార్టీ ఏ పార్టీకి రాదని, హంగ్ ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముందునుంచి చెబుతున్నట్లు జేడీ(ఎస్) కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీనేతలు పేర్కొంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో 25ఏళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే పార్టీలు పూర్తిస్థాయి మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టారు. 1999, 2013 ఎన్నికల్లో ఒకేఒక్క పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన సీట్లు గెలుచుకుంది. అదికూడా ప్రధాన పార్టీలో చీలక వస్తే ఆ ప్రభావం ప్రత్యర్థి పార్టీలకు కలిసొస్తుంది.

Karnataka elections 2023: కాంగ్రెస్‌కు అదిరిపోయే కౌంటర్.. జై బజరంగ్ బలీ నినాదాలు చేసిన మోదీ.. వీడియో

1999 సంవత్సరంలో జనతాదళ్‌లో చీలక కారణంగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా మెజార్టీ సాధించింది. 2013లోనూ యడియూరప్ప రూపంలో బీజేపీలో చీలక రావడంతో కాంగ్రెస్ లాభపడింది. ఈసారి హంగ్ వస్తుందని, జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఆశతో ఉన్నారు. ఈసారి కన్నడ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనే విషయంపై స్పష్టత రావాలంటే మే 13 వరకు ఆగాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు