Woman giving birth RTC Bus : ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు .. ప్రసవం చేసిన కండక్టర్

ఆర్టీసీ బస్సులో ఓ గర్భిణి ప్రసవించింది. పురిటి నొప్పులతో విలవిల్లాడిపోతున్న గర్భిణికి కండక్టర్ డాక్టర్ గా మారి ప్రసవం చేసారు.

Woman giving birth RTC Bus : ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు .. ప్రసవం చేసిన కండక్టర్

Woman giving birth RTC Bus

Updated On : May 17, 2023 / 1:56 PM IST

KS RTC Bus Woman giving birth : అది బెంగళూరు- చిక్ మంగళూరు రూట్లో తిరిగే ఆర్టీసీ బస్సు. ఆ బస్సులో ఓ గర్భిణీ ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి పురిటి నొప్పులొచ్చాయి ఆమెకు. ఆ బస్సులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. ఆ బస్సులో విధులు నిర్వహించే మహిళా కండర్ ప్రసవం చేయటంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ గర్భిణి. కర్ణాటకలోని చిక్కమగళూరులో మే 15 సోమవారం(202) రోజున చోటు చేసుకుంది.

బెంగళూరు నుంచి చిక్కమగళూరు వెళ్తున్న బస్సులో దాదాపు 45 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఫాతిమా అనే 22 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. ఆమె గర్భిణి. బస్సు వెళ్తున్న సమయంలో ఫాతిమాకు ఉన్నట్లుండి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులతో విలవిల్లాడిపోయింది. అది గమనించిన ఆ బస్సులో డ్యూటీ చేసే మహిళా కండక్టర్ వసంతమ్మ బస్సును ఆపమని డ్రైవర్ కు చెప్పటంతో బస్సు ఆపేశారు. వెంటనే వసంతమ్మ ప్రయాణికులందరినీ కిందకు దిగమని చెప్పారు. ఆ తర్వాత బస్సులోనే బిడ్డను ప్రసవించేందుకు ఫాతిమాకు సహకరించింది. అలా కండక్టర్ వసంతమ్మ సహకారంతో ఫాతిమా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

అంతేకాదు వసంతమ్మ ప్రయాణికుల దగ్గర రూ.1500 రూపాయిలను వసూలు చేసి ఫాతిమాకు ఆమె అర్థిక సహాయాన్ని కూడా అందించింది. దీంతో కండక్టర్ వసంతమ్మకు అభినందనలు వెల్లువెత్తాయి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వసంతమ్మ అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించారు. ఫాతిమాను అక్కడి నుంచి అంబులెన్స్ లో శాంతిగ్రామ్ ఆసుపత్రికి తరలించారు. వసంతమ్మ 20 ఏళ్ల క్రితం లేబర్ వార్డులో అసిస్టెంట్ గా పని చేయటంతో ఫాతిమా పాలిట వరం అయ్యింది. లేబర్ వార్డులో పనిచేసి వసంతమ్మ కేఎస్ఆర్టీసీలో కండక్టర్ గా చేరారు.

దీనిపై కండక్టర్ వసంతమ్మ మాట్లాడుతు..మనం నేర్చుకున్నది ఏదీ కూడా వృథా కాదని ఈ ప్రసవం తరువాత తెలిసిందని నేను లేబర్ వార్డులో పనిచేసిన సమయంలో తీసుకున్న ట్రైనింగ్ ఇలా ఉపయోగపడిందని తెలిపారు. వసంతమ్మ చేసిన ఈ సహాయం గురించి కేఎస్ఆర్టీసీ స్పందిస్తు..గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్ ను తోటి ప్రయాణీకులను అభినందించింది. ప్రసవం చేసిన కండక్టర్ వసంతమ్మతో పాటు తల్లీ బిడ్డల ఫోటోలను కేఎస్ ఆర్టీసీ ట్విట్టర్ లో షేర్ చేసింది.