కాంగ్రెస్‌తో బీజేపీ సీక్రెట్‌ పొత్తు

  • Publish Date - March 5, 2019 / 12:26 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌కు కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు ఉంటుందని భావించగా.. రాహుల్ గాంధీతో మీటింగ్ అనంతరం పొత్తు పెట్టుకోట్లేదంటూ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే పొత్తు ఉండదంటూ కాంగ్రెస్ ప్రకటించడంపై ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రహస్య ఒప్పందం చేసుకుని కలిసిపోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : టీడీపీకి షాక్: జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే

మోదీ, అమిత్‌ షా ద్వయాన్ని ఓడించాలని దేశం మొత్తం కోరుకుంటున్న సమయంలో బీజేపీ వ్యతిరేక ఓట‍్లను చీల్చడానికి కాంగ్రెస్‌ సహకరిస్తోందంటూ ఆయన ఆరోపించారు. లోలోపల జరిగిన అపవిత్ర పొత్తును ప్రజలు అంగీకరించరని, వీరిని  తిప్పికొట్టేందుకు ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌లను చిత్తుగా ఒడిస్తామంటూ ట్విటర్ ద్వార కేజ్రీవాల్ చెప్పారు.

Also Read : అది ప్రభుత్వం తప్పే.. టీఆర్‌ఎస్ ఆరు సీట్లు కూడా గెలవదు