Arvind Kejriwal: మళ్లీ అధికారంలోకి వస్తే ఆ బిల్లులన్నీ మాఫీ చేస్తాం.. ఢిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ హామీ

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు.

Arvind Kejriwal: మళ్లీ అధికారంలోకి వస్తే ఆ బిల్లులన్నీ మాఫీ చేస్తాం.. ఢిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ హామీ

Arvind Kejriwal

Updated On : January 4, 2025 / 1:33 PM IST

Delhi Elections 2025: ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఢిల్లీలో ప్రస్తుత ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అయితే, అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికలు జరిపేలా కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. తుది ఓటర్ల జాబితాను వచ్చే నెల 6వ తేదీన ప్రచురిస్తామని ఈసీ అధికారులు తెలిపారు. దీంతో మరో నెలరోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. తాజాగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పర్యటించి వరాల జల్లు కురిపించడంతో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.

Also Read: KTR : ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం అదే..! రేవంత్ సర్కార్ పై వరుస ట్వీట్లతో కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు మేలుచేసేలా కీలక ప్రకటన చేశారు. మళ్లీ ఆప్ అధికారంలోకి వస్తే నీటి బిల్లులను మాఫీ చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ప్రతినెలా 20వేల లీటర్ల ఉచిత మంచినీరు అందిస్తుందని, దీని ద్వారా 12లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేజ్రీవాల్ చెప్పారు. అయితే, నేను జైలుకు వెళ్లినప్పటి నుంచి బీజేపీ వాళ్లు ఏం చేశారో తెలియడం లేదు.. ఢిల్లీలో ప్రజలకు తప్పుడు నీటి బిల్లులు రావడం మొదలైయ్యాయి. దీంతో ఆ నీటి బిల్లులను చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఆ తప్పుడు బిల్లులన్నింటిని మాఫీ చేస్తామని క్రేజీవాల్ హామీ ఇచ్చారు.

Also Read: విషాదం నింపిన సరదా.. శేషాచలం అడవుల్లోకి వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు మృతి

ఢిల్లీలో పంజాబ్ మహిళలు చేస్తున్న నిరసన గురించి కేజ్రీవాల్ మాట్లాడారు. పంజాబ్ మహిళలందరూ ఆప్ పార్టీతో ఉన్నారని, వారికి మాపై నమ్మకం ఉందని చెప్పారు. ఆ ప్రదర్శనను కాంగ్రెస్, బీజేపీ వాళ్లు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

 

29మందితో బీజేపీ తొలి జాబితా..
మరోవైపు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. 29మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. కేజ్రీవాల్ పై పర్వేష్ సింగ్ వర్మ పోటీ చేయనుండగా.. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపై రమేశ్ బిదూరి పోటీ చేయనున్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తాజాగా బీజేపీ 29మందితో తొలి విడుత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.