Yogi Vs Kejriwal: సీఎంలు “యోగి – కేజ్రీవాల్” మధ్య అర్ధరాత్రి ట్విట్టర్ యుద్ధం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య సోమవారం అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది.

Yogi Vs Kejriwal: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య సోమవారం అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు సీఎంలు “నువ్వంటే – నువ్వంటూ” పరస్పరం మాటల దాడులు చేసుకున్నారు. కరోనా సమయంలో ప్రజలను రక్షించుకునేందుకు దేశంలో లాక్ డౌన్ విధించగా..ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలనీ కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే ఢిల్లీలోని ఆప్ సర్కార్, మహారాష్ట్రలోని కాంగ్రెస్ నేతలు వలస కూలీలను స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ రైళ్లు ఏర్పాటు చేసిమరి గుంపులు గుంపులుగా తరలించారు. దీనిపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తూ.. దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ నేతలు, ఆప్ సర్కారే కారణమంటూ మండిపడ్డారు.

Also read: Arunachal Avalanche: హిమపాతంలో చిక్కుకుని ఏడుగురు సైనికాధికారులు గల్లంతు

ప్రధాని వ్యాఖ్యలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. అయితే ప్రధాని చెప్పిన సత్యాన్ని కేజ్రీవాల్ వొప్పుకోవాలంటూ సీఎం యోగిఅదిత్యానాథ్ ట్వీట్ చేశారు. అబద్ధాలు చెప్పడంలో కేజ్రీవాల్ దిట్ట అంటూ మండిపడ్డారు. మహమ్మారి నుంచి ప్రజలను రక్షించుకునేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో జాతి మొత్తం ఏకమై కరోనాను పోరాడుతున్న సమయంలో, ఢిల్లీలో ఉన్న వలస కార్మికులను కేజ్రీవాల్ బయటకు గెంటేశాడని, సీఎం యోగి పేర్కొన్నారు. “చూడు కేజ్రీవాల్..కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో జాతి మొత్తం పోరాడుతుంటే నువ్వు మాత్రం.. ఢిల్లీలో ఉన్న యూపీ కూలీలను.. మా రాష్ట్ర సరిహద్దుల వద్ద వదిలేసావు. మీ ఆప్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అమానుషంగా ప్రవర్తించి.. నిస్సహాయస్థితిలో ఉన్న చిన్నపిల్లలు, మహిళలను అర్ధరాత్రి వేళ యూపీ సరిహద్దులలో విడిచిపెట్టారు. నిన్ను మానవత్వానికే శత్రువుగా చూడాలా?” అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేసారు.

Also read: Arasavelli Temple: అరసవెల్లిలో తొలిపూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

సీఎం యోగి ట్వీట్ పై కేజ్రీవాల్ స్పందిస్తూ..”ఆసంగతి వదిలేసి ఇది విను యోగి..ఉత్తరప్రదేశ్ లో కరోనా కారణంగా మృతి చెందిన వారి మృతదేహాలు గంగా నదిలో తేలియాడుతూ కొట్టుకుపోతుంటే.. నువ్వు మాత్రం నీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి టైమ్స్ మ్యాగజైన్లో ప్రకటనలు ఇచ్చుకున్నావు. నీలాంటి కఠినమైన మరియు క్రూరమైన పాలకుడని నేను ఇంత వరకు చూడలేదు” అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. పంజాబ్, యూపీ ఎన్నికల నేపథ్యంలో వీరిరువురి ట్వీట్లు ఇప్పుడు కాక రేపుతున్నాయి.

Also read: Corona Vaccine: ఐడీ ప్రూఫ్ లేకుండానే వాక్సిన్ పంపిణీ చేశాం: సుప్రీంకు తెలిపిన కేంద్రం

ట్రెండింగ్ వార్తలు