Corona Vaccine: ఐడీ ప్రూఫ్ లేకుండానే వాక్సిన్ పంపిణీ చేశాం: సుప్రీంకు తెలిపిన కేంద్రం

కరోనా వాక్సిన్ పొందేందుకు కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Corona Vaccine: ఐడీ ప్రూఫ్ లేకుండానే వాక్సిన్ పంపిణీ చేశాం: సుప్రీంకు తెలిపిన కేంద్రం

Corona

Corona Vaccine: కరోనా వాక్సిన్ పొందేందుకు కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సుప్రీం ధర్మాసనానికి వివరాలు అందించింది. ప్రజల ప్రాధమిక హక్కైనా కరోనా వాక్సిన్ పొందేందుకు ఐడీ కార్డులు ఎందుకంటూ..ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా..ఆమేరకు స్పందించిన సుప్రీం ధర్మాసనం..కరోనా వాక్సిన్ పొందేందుకు ఆధార్ తప్పనిసరని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని..మరే ఇతర ఐడీ కార్డు ద్వారానైనా కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. అదే సమయంలో “ఐడీ కార్డు తప్పనిసరి” విధానంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వైద్యారోగ్యశాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది.

Also read: PM Modi: కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేసిన ప్రధాని మోదీ, మరీ ఈ రేంజ్ లోనా

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. కరోనా వాక్సిన్ తీసుకోదలచిన వ్యక్తి.. ప్రభుత్వం సూచించిన తొమ్మిది ఐడీ కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని వాక్సినేషన్ సమయంలో పొందుపరచాల్సి ఉంటుందని.. అయితే కొన్ని వర్గాల ప్రజలకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, పెన్షన్ పాస్‌బుక్, NPR స్మార్ట్ కార్డ్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ సహా ప్రభుత్వం జారీ చేసిన ఏ ఇతర ఐడీ ప్రూఫ్ ద్వారానైనా కరోనా వాక్సిన్ వేసుకోవచ్చని ప్రభుత్వ న్యాయవాది అమన్ శర్మ సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. కొంతమంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి ఐడీ కార్డు అవసరం లేకుండానే వాక్సిన్ పంపిణీ చేసినట్లు తెలిపారు.

Also read: Tirumala Ratha Saptami : ఒకేరోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

సాధువులు, ఇతర మతబోధకులు, సంచారజీవులు, జైలు ఖైదీలు, మానసిక రోగులు, మరియు 18 ఏళ్ళు పైబడి.. ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు కార్డు పొందలేని వారిని ఈ జాబితా నుంచి మినహాయింపు ఇచ్చారు. కరోనా వాక్సిన్ కోసం ఇప్పటివరకు కోవిన్ పోర్టల్లో 115 కోట్లమంది రిజిస్టర్ చేసుకోగా.. అందులో 85.6 కోట్ల మంది ఆధార్ కార్డు పొందుపరిచారని, ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండానే 87 లక్షల మందికి కరోనా వాక్సిన్ పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనానికి తెలిపింది.

Also read: Nanditha Swethaa : ఆంటీలా ఉన్నావు అన్న నెటిజన్.. కౌంటర్ ఇచ్చిన నందిత శ్వేతా..