PM Modi: కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేసిన ప్రధాని మోదీ, మరీ ఈ రేంజ్ లోనా

50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు గ్రహించండి అంటూ చెప్పిన మాటలకు కాంగ్రెస్ నేతల ముఖాలు చిన్నబుచ్చుకున్నాయి.

PM Modi: కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేసిన ప్రధాని మోదీ, మరీ ఈ రేంజ్ లోనా

Modi

PM Modi: ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ పార్టీ బుద్ధి మాత్రం మారడం లేదంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రధాని మోదీ సోమవారం లోక్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధాని మాట్లాడిన ఒక్కో మాట కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయి పడినట్లయింది. మరో వందేళ్లైనా మీరు అధికారంలోకి రాలేరంటూ ప్రధాని మోదీ పేల్చిన మాటలు..కాంగ్రెస్ నేతల గుండెల్లో తూటాలు దించాయి. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు గ్రహించండి అంటూ చెప్పిన మాటలకు కాంగ్రెస్ నేతల ముఖాలు చిన్నబుచ్చుకున్నాయి.

Also read: Khiladi Movie : సినిమా హిట్ అవుతుందని ముందే తెలుసు.. అందుకే కార్ గిఫ్ట్ ఇచ్చాను..

గత వారం లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగానికి ప్రధాని మోదీ ధీటుగా బదులిచ్చినట్లు తెలుస్తుంది. దేశం లోపల, బయట పరిస్థితులు బాగోలేవని, చైనాతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని రాహుల్ చెప్పుకొచ్చాడు. దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాహుల్ మాట్లాడిన తీరు బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. దేశంలో ఏదో జరుగుతుందంటూ.. రాహుల్ గాంధీ ప్రజల్లో ఆందోళన పెంచేందుకు ప్రయత్నించి.. నేడు మోదీ చేతిలో అబాసుపాలయ్యాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్‌సభ సాక్షిగా ప్రధాని మోదీ ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసారంటే.. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

Also read: WHO Chief: కరోనాకి ఇప్పట్లో అంతం లేదు.. దశాబ్దాల పాటు ఉంటుంది – WHO Chief

దేశాన్ని 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఒక్కో రాష్ట్రంలో అధికారం ఎలా కోల్పోయిందో చెబుతూ.. ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతలకు చురకలు అంటించారు. అధికారంలోకి రావాలనే ఆశ కాంగ్రెస్ నేతల్లో చచ్చిపోయిందని..కనీసం బీజేపీ పై బురదచల్లే ప్రయత్నమైనా చేద్దామని.. ఇలా సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. బ్రిటిషు వారిలాగా.. విభజించు – పాలించు విధాన్నాన్ని అనుసరించిన కాంగ్రెస్ పార్టీ..తమ పాలనలో ఏనాడూ కనీస ధర్మాన్ని పాటించింది లేదని ప్రధాని మోదీ విమర్శించారు. తెలంగాణ ఇచ్చినా అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారని, తమిళనాడు ప్రజలను కాంగ్రెస్ రెచ్చగొట్టిందని, ఇలా దేశాన్ని చిన్నాభిన్నం చేసి కాంగ్రెస్ సాధించిందేమిటో ఆత్మశోధన చేసుకోవాలని మోదీ అన్నారు.