స్వామియే శ ‘రణం’ – సుప్రీం తీర్పును గౌరవిస్తాం – పినరయి

  • Publish Date - January 3, 2019 / 06:04 AM IST

తిరువనంతపురం : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని…కేరళలో గొడవల వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ హస్తం ఉందని…అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులను అడ్డుకోవడం సరికాదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఇద్దరు మహిళలు అయ్పప్పను దర్శించుకోవడంపై హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జనవరి 3వ తేదీ గురువారం కేరళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ రణరంగంగా..హింసాత్మకంగా మారడంతో రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ మీడియాతో మాట్లాడారు. 
ఇద్దరు మహిళలు జనవరి 2వ తేదీ తెల్లవారుజామున దర్శనం.
మహిళల దర్శనం అనంతరం ఆలయ తలుపులు మూసివే. శుద్ధి కార్యక్రమం. 
హిందూ సంఘాల ఆగ్రహం. ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణ.

సర్కార్‌తో ఘర్షణకు దిగడం సరికాదన్న పినరయి శాంతి భద్రతల సమస్యలను పోలీసులు చూసుకుంటారని వెల్లడించారు.  దర్శనానికి వచ్చే భక్తులను అడ్డుకోవడం సరికాదన్నారు. మహిళా భక్తులను అడ్డుకోవడం కోర్టు ధిక్కారం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని..శబరిమలను రణరంగంగా మార్చారని, రాజకీయ కుట్రలో భాగంగానే అల్లర్లు జరుగుతున్నాయన్నారు. 
ఇరుముడి లేకుండానే మహిళలను ఎలా దర్శనానికి అనుమతినిస్తారు ? 
జనవరి 3వ తేదీ గురువారం కేరళ బంద్.
బంద్ హింసాత్మకం. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ కార్యకర్త మ‌ృతి. 
60 బస్సులపై దాడి. స్తంభించిన జనజీవనం 
Read More : 
కేరళలో ఫుల్ టెన్షన్ : కొనసాగుతున్న కేరళ బంద్
Read More : అయ్యప్ప ఆలయంలోకి మహిళ ఎంట్రీ ఎలాగంటే 

Read More : గురువారం కేరళ బంద్
Read More : నివురుగప్పిన నిప్పులా కేరళ : స్తంభించిన జనజీవనం