Kerala woman cop : మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం…నిందితురాలి పాపకు పాలిచ్చిన వైనం

ఓ మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం చూపించింది. ఓ నిందితురాలి నాలుగు నెలల పాపకు తన స్థన్యమిచ్చిన పోలీసు అధికారిణి ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. అందరి హృదయాలను కదిలించిన ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది......

Kerala woman cop

Kerala woman cop : ఓ మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం చూపించింది. ఓ నిందితురాలి నాలుగు నెలల పాపకు తన స్థన్యమిచ్చిన పోలీసు అధికారిణి ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. అందరి హృదయాలను కదిలించిన ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఓ కేసులో నిందితురాలైన మహిళ జైలులో ఉంటోంది. జైలులో ఉన్న మహిళ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఎర్నాకుళంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తీసుకువచ్చారు.

ALSO READ : Uttarakhand : 13 రోజులుగా ఉత్తరాఖండ్ టన్నెల్ లోనే 41 మంది కార్మికులు.. డ్రిల్లింగ్ మిషన్ లో సాంకేతిక లోపంతో నిలిచిన రెస్క్యూ ఆపరేషన్

ఓ కేసులో నిందితురాలైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆమె నాలుగు నెలల శిశువు ఆకలితో గుక్క పట్టి ఏడుస్తోంది. అంతే సివిల్ పోలీసు అధికారిణి అయిన ఎంఏ ఆర్య నిందితురాలి కుమార్తెను ఒడిలోకి తీసుకొని పాలిచ్చింది. ఈ మహిళకు ఉన్న మరో ముగ్గురు పిల్లలకు పోలీసుస్టేషన్ సిబ్బంది భోజనం పెట్టారు. ఏడుస్తున్న శిశువును ఓదార్చి తన స్థన్యమిచ్చి పాలిచ్చి అమ్మతనాన్ని చూపిన ఆర్యను అందరూ ప్రశంసించారు. అనంతరం పోలీసులు నిందితురాలి పిల్లలను ఛైల్డ్ కేర్ హోంకు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు