Solar Umbrella For Traffic Personnel : మండే ఎండల్లో చల్ల చల్లగా..ట్రాఫిక్ పోలీసుల కోసం సోలార్ గొడుగులు

ట్రాఫిక్​ పోలీసుల కష్టాలను తీర్చే ప్రయత్నాల్లో భాగంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండుతున్న ఎండల్లో గంటల తరబడి నిల్చొని విధులు నిర్వర్తించే ట్రాఫిక్​ పోలీసుల కోసం

Kerala2

Solar Umbrella For Traffic Personnel :  మండుతున్న ఎండల్లో గంటల తరబడి నిల్చొని విధులు నిర్వర్తించే ట్రాఫిక్​ పోలీసుల కోసం ప్రత్యేక సదుపాయాలతో కూడిన సౌరగొడుగులను అందించేందుకు కేరళ ప్రభుత్వం రెడీ అయింది.  పైలట్ ప్రాజెక్టుగా కొచ్చి సిటీలో ఇలాంటి ఐదు గొడుగులను కేరళ పోలీసు విభాగం ఏర్పాటు చేసింది.

ఈ గొడుగు లోపల సౌరశక్తి ఆధారంగా పనిచేసే ఒక ఫ్యాన్​ ఉంటుంది. వాటర్ బాటిల్​ పెట్టుకొనేందుకు వీలుగా ఒక స్టాండ్​ కూడా అమర్చారు. గొడుగు పైభాగాన సోలార్​ ప్యానెల్​ ఏర్పాటు చేశారు. ​గొడుగు కింది భాగంలో బ్యాటరీ ఉంటుంది. గొడుగు కింద కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైట్​ ఏర్పాటు చేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో ఎప్పుడూ నిల్చొనే పనిచేసే ట్రాఫిక్​ పోలీసులు కొంతసేపు కూర్చునే వీలుంటుంది.ఈ పైలట్​ ప్రాజెక్టు విజయవంతమైతే..ఇతర జిల్లాలకు కూడా విస్తరించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ Bangarraju: వాసివాడి తస్సదియ్యా టీజర్.. చిట్టితో అక్కినేని హీరోల అల్లరి డాన్స్!