కేరళ వినూత్న ప్రయత్నం : కరోనా కియోస్క్.. అంటే ఏమిటి

  • Publish Date - April 7, 2020 / 04:56 AM IST

కరోనాపై పోరాటంలో తిరుగులేని స్ఫూర్తి ప్రదర్శిస్తోన్న కేరళ ఇప్పుడు మరో వినూత్నమైన ప్రయత్నం మొదలుపెట్టింది…కరోనా టెస్టుల కోసం వాక్ ఇన్ సింపుల్ కియోస్క్‌ అంటూ కరోనా  కియోస్క్‌లు ప్రారంభించింది..అత్యంత ఖరీదైన ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ లే9ురచ కుండానే వైద్యసిబ్బంది కరోనా టెస్టులు చేయగలగడమే ఈ కియోస్క్ ప్రత్యేకత. కరోనా వైరస్ జనాల ప్రాణాలను బలిగొంటున్నవేళ..ప్రతి ఒక్కరిలో భయం భయం..చిన్న దగ్గు వచ్చినా..జ్వరం వచ్చినా వెంటనే వైరస్ సోకిందేమో అన్న అనుమానం.

అదే భయం టెస్ట్ చేసే వైద్యసిబ్బందికి కూడా ఉంటోంది..సరైన రక్షణ పరికరాలు లేకుండా అనుమానితులకు పరీక్షలు చేయాలంటే అదో భయం….ఇలాంటి వాటికి చెక్ పెడుతూ కేరళలోని ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం ఓ సింపుల్ మార్గం ద్వారా పరిష్కారం తయారు చేసింది.. వాక్ ఇన్ సింపుల్ కియోస్క్ పేరుతో ఎక్కడిక్కడ టెస్ట్ సెంటర్లు ప్రారంభించింది. ఇందులో ఉండే హెల్త్ వర్కర్లు అనుమానితుల రక్త నమూనాలు..గొంతులోని కళ్లె పరీక్షలను రెండు నిమిషాల్లోనే పూర్తి చేస్తారు…

ఇది పూర్తిగా సురక్షితం..దీనికి సౌత్ కొరియాలో లక్షలాదిమందికి కోవిడ్ టెస్టుల చేసిన పద్దతే స్ఫూర్తిగా చెప్తున్నారు…కరోనాని ఇలా ఎక్కువమందికి టెస్టులు చేయడం ద్వారానే కరోనా కర్వ్‌ని కట్టడి చేసింది సౌత్ కొరియా ఈ వాక్ ఇన్ శాంపిల్ కియోస్క్‌లో ఉండే హెల్త్ వర్కర్లు ఎలాంటి ప్రొటెక్టివ్ పర్సనల్ ఎక్విప్‌మెంట్ ధరించాల్సిన అవసరం లేదు..దీంతో భారీగా ఖర్చు తగ్గుతుంది..అలానే వైద్య సిబ్బందిపై పడే మానసికభారం కూడా ఉండదు..ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాంటి కియోస్క్‌ల ఏర్పాటుతో టెస్టింగ్ చేయడం సులభంగా సాధ్య పడుతుంది…

ఎర్నాకులమ్ కలెక్టర్ ఎస్.సుహాస్ స్వయంగా ఇదెలా పని చేస్తుందో వారి ఫేస్‌బుక్‌ పేజ్‌లో వివరించడంతో ఇది బాగా వైరల్ అవుతోందిప్పుడు.. కియోస్క్ కేబిన్ చుట్టుపక్కల గ్లాస్ తో క్లోజ్ చేసి ఉండగా..ముందువైపు రెండు రబ్బర్ గ్లోవ్స్ అమర్చబడి ఉంటాయ్. ఎవరికైతే టెస్ట్ చేయాలో వారు గ్లాస్ స్క్రీన్ ముందు ఉంటారు..టెస్ట్ చేసే హెల్త్ సిబ్బంది..తమ చేతులు శానిటైజర్ ద్వారా శుభ్రపరుచుకుని..ముందు డిస్పోజబుల్ గ్లవ్స్..తర్వాత రబ్బర్  గ్లవ్స్‌లో చేతులు దూర్చి..అనుమానితుడు తాలూకూ శాంపిల్స్ సేకరిస్తారు..దీంతో ఎక్కడా ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా టెస్ట్ చేయడం సాధ్యపడుతుంది..

శాంపిల్ తీసే ముందు…తీసిన తర్వాత గ్లాస్ స్క్రీన్‌ని శానిటైజ్ చేస్తే సరిపోతుంది…ఇదే మోడల్ కనుక విరివిగా ఉపయోగిస్తే..ప్రతి పంచాయితీలోనూ శాంపిల్స్ తీసుకోవడం సులభం అవుతుందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది..శాంపిల్ తీసుకున్న ప్రతి సారీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ పారేయాల్సి వస్తోంది ఆ సమస్యకి ఇలాంటి కియోస్క్‌లతో చెక్ పెట్టవచ్చని కేరళ భావిస్తోంది.

ఇప్పటికే ఈ ఐడియాని కలామసేరీ మెడికల్ కాలేజీ ఇంప్లిమెంట్ చేస్తోంది కూడా..శాంపిల్ కలెక్షన్‌తో పాటు..రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్‌లను కూడా కియోస్క్‌ల ద్వారా చేయవచ్చు..ఈ వాక్ ఇన్ సింపుల్ కియోస్క్‌ల ఏర్పాటుకి మొదట్లో 40వేల రూపాయల ఖర్చు అవుతుంది. విస్క్‌లుగా పిలుస్తోన్న ఈ కియోస్క్ ఏర్పాటు బాగా ఉపయోగంగా ఉండటంతో..కేరళ ప్రభుత్వం..స్థానిక పంచాయితీలను..స్వచ్చంధ సంస్థలను వీటిని నెలకొల్పడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది.