Kerala: కేరళ గవర్నర్‭కు షాకిచ్చిన సీఎం.. ఛాన్స్‭లర్ పదవి నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్

కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య కయ్యం పరిపాటిగా మారింది. నిజానికి బీజేపీ ప్రభావం లేని మూడు దక్షిణాది రాష్ట్రాల్లోని గవర్నర్లతో అక్కడి ప్రభుత్వాల మధ్య ఘర్షణ సాధారణ విషయంగా మారింది

Kerala: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‭కు ప్రభుత్వానికి మధ్య చాలా రోజులుగా వాగ్వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో గవర్నర్‭కు సీఎం పినరయి విజయన్ షాకిచ్చారు. కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్స్‭లర్ పదవి నుంచి గవర్నర్‭ను తొలగిస్తున్నట్లు గురువారం సాయంత్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇరు వైపుల నుంచి విమర్శలు తీవ్ర స్థాయికి చేరిన మరునాడే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఉన్న నియమ నిబంధనలను మారుస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఆ స్థానంలో కళలు, సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని నియమించనున్నట్లు పినరయి ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రతినిధనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నేతృత్వంలోని ప్రభుత్వంతో ఆయనకు చాలా కాలంగా పొసగడం లేదు. ప్రతి రోజు ఇరు వర్గాల మధ్య కయ్యం పరిపాటిగా మారింది. నిజానికి బీజేపీ ప్రభావం లేని మూడు దక్షిణాది రాష్ట్రాల్లోని గవర్నర్లతో అక్కడి ప్రభుత్వాల మధ్య ఘర్షణ సాధారణ విషయంగా మారింది. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని ఉపసంహరించుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కేరళ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‭ను తొలగిస్తూ పినరయి ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించింది. ఇక తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ర, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఇక నుంచి గవర్నర్ సారథ్యం అవసరం లేదని కేరళ ప్రభుత్వం ముక్తకంఠంగా చెప్తోంది. వైస్ ఛాన్సలర్ల నియామకంతో సహా విశ్వవిద్యాలయాల పనితీరుపై ఇరుపక్షాల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం 9 మంది వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీమ్డ్ యూనివర్శిటీ నియమాలు సవరించి, గవర్నర్‭ను తొలగించడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇది మిగిలిన రాష్ట్రాలను సైతం కదిలించొచ్చని అంటున్నారు.

Elon Musk Goat: ₹4.8 కోట్లతో ఎలాన్ మస్క్ విగ్రహం ఏర్పాటు చేసిన అభిమానులు

ట్రెండింగ్ వార్తలు