Elon Musk Goat: ₹4.8 కోట్లతో ఎలాన్ మస్క్ విగ్రహం ఏర్పాటు చేసిన అభిమానులు

సక్సెస్ మంత్ర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ, వారికి విగ్రహాలు కట్టడం, దండలు వేయడం లాంటివి అస్సలు ఉండవు. గతంలో ఏ వ్యాపారవేత్తకైనా అభిమానులు విగ్రహాలు పెట్టారా అనే విషయం స్పష్టంగా తెలియదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఆ అవకాశం కొట్టేశారు. తాజాగా 30 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. క్రాఫ్ట్ వర్కులో జంతువును పోలిన ఆకారానికి ఎలాన్ మస్క్ తలను అతికించారు

Elon Musk Goat: ₹4.8 కోట్లతో ఎలాన్ మస్క్ విగ్రహం ఏర్పాటు చేసిన అభిమానులు

Elon Musk Supporters Build His 30 foot Goat

Elon Musk Goat: అభిమానులు అందరికీ ఉంటారు. కానీ ఆయా రంగాల్లోని అభిమానులు ఆయా రంగాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. సినిమా లాంటి రంగాల్లోని అభిమానులు.. తాము అభిమానించే వారిని నెత్తిన ఎత్తుకుంటారు. విగ్రహాలు కడతారు, ఫ్లెక్సీలు పెడతారు, ప్రచారాలు చేస్తారు. ఇంకా ముదిరితే గుడులు కూడా కట్టేస్తారు. ఇక మిగిలిన రంగాల్లోని అభిమానులు మరీ ఇలా ఉండరు కానీ, సందర్భాల్ని బట్టి తమ అభిమానాన్ని కాస్త పెద్దగానే చూపిస్తుంటారు. అయితే వ్యాపార రంగంలోని అభిమానులు ఇందుకు పూర్తిగా భిన్నం.

తాము అభిమానించే వారిని సక్సెస్ మంత్ర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ, వారికి విగ్రహాలు కట్టడం, దండలు వేయడం లాంటివి అస్సలు ఉండవు. గతంలో ఏ వ్యాపారవేత్తకైనా అభిమానులు విగ్రహాలు పెట్టారా అనే విషయం స్పష్టంగా తెలియదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఆ అవకాశం కొట్టేశారు. తాజాగా 30 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. క్రాఫ్ట్ వర్కులో జంతువును పోలిన ఆకారానికి ఎలాన్ మస్క్ తలను అతికించారు. జంతువంటే ఇదేదో మామూలు జంతువు అనుకోవద్దు. ఇంగ్లీషులో ‘జీ.వో.ఏ.టీ.’ అనే అక్షరాలను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే అర్థంలో ఉయోగిస్తారు.

అలాంటి రూపంలోనే తాజా విగ్రహం ఏర్పాటు చేసి జీ.వో.ఏ.టీ అని నామకరణం చేశారు. పైగా ఈ విగ్రహం రాకెట్‭పై ఉంది. స్పేస్ ఎక్స్ అనే సంస్థ ద్వారా అంతరిక్షంలో సైతం మస్క్ ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి గుర్తుగా ఇలా రాకెట్‭పై మస్క్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విగ్రహం విలువ 4.8 కోట్ల రూపాయలు (6 లక్షల డాలర్లు). ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. కెనడియన్ శిల్పులైన కెవిన్, మిచెల్ స్టోన్ దీనిని రూపొందించారు.

విగ్రహం తల (మస్క్ తల) అల్యూమినియంతో తయారు చేశారు. అప్పట్లో డాగీ కాయిన్ అంటూ మస్క్ ఊదరకొట్టిన విషయం తెలిసిందే. దానికి గుర్తుగా మెడలో ఒక టోకెన్ వేలాడదీశారు. ఈ నెలాఖరు లోగా దీనికి మస్క్‭కు బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. తమదైన రీతిలో నెటిజెన్లు స్పందిస్తున్నారు.

Shocking Video: బాబోయ్.. మొసలిని కూడా వదలని కొండచిలువ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే ..