రాత్రి 10 వరకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..కొత్త సంవత్సరంలో కొత్త కరోనా రూల్స్

Kerala new Year new covid Strain Rules : కరోనా ట్రెండ్ మార్చింది. కరోనా అనే మాట కామన్ అయిపోయింది. ఇప్పుడంతా కొత్త కరోనా ‘స్ట్రెయిన్’స్టైల్. యూకే మరింత వేగంగా మరింత బలంగా జనాలపై విరుచుకుపడుతోంది కొత్త కరోనా స్ట్రెయిన్. ప్రపంచం అంతా అప్రమత్తమైంది. చైనా కరోనా కల్లోలం మొదలై సంవత్సరం దాటిపోయింది. 2021 కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. కొత్త సంవత్సరం రాకుండానే కొత్త కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో కొత్త సంవత్సరం వేడుకలపై ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు కొత్త నిబంధనల్ని విధించాయి.
ముఖ్యంగా పాత కరోనా కట్టడి చేయటంలో ముందున్న కేరళ ప్రభుత్వం ఈ కొత్త కరోనా విషయంలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నిబంధనల్ని కఠినతరం చేసింది. ఏమాత్రం రాజీ పడేది లేదంటూ రాత్రి 10గంటల లోపే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ క్లోజ్ చేయాలంటే ఆదేశాలు జారీచేసింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుందని కాస్త ఊపిరి పీల్చుకంటున్న సమయంలో యూకేనుంచి కొత్త వైరస్ స్ట్రెయిన్ దాడి ప్రారంభించింది. బ్రిటన్ రిటర్స్న్ నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి పట్ల అయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ సభలను నిషేధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
గురువారం (డిసెంబర్ 31,2020) కేరళలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాత్రి 10గంటలలోపు ముగించాలని పినరాయి విజయన్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్న అధికారులు ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కుల ధరించాలనీ..సామాజిక దూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.
కేంద్రం సూచించిన కోవిడ్ 19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఇది ప్రతీ ఒక్కరి బాధ్యతగా ఉండాల్సిన కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించింది. నిబంధనలను పాటించని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. కొవిడ్ 19 మార్గదర్శకాలను పాటించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.