Kerala Covid-19 Lockdown : కేరళలో మరోవారం కొవిడ్-19 లాక్‌డౌన్ పొడిగింపు

కేరళలో మరో వారం కొవిడ్-19 లాక్ డౌన్ పొడిగించారు. రాష్ట్రంలో ప్రతిరోజు కొత్తగా దాదాపు 7వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గడం ఇదే తొలిసారి..

Kerala Covid-19 lockdown by one week : కేరళలో మరో వారం కొవిడ్-19 లాక్ డౌన్ పొడిగించారు. రాష్ట్రంలో ప్రతిరోజు కొత్తగా దాదాపు 7వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గడం ఇదే తొలిసారి.. సోమవారం (జూన్ 21) నాటికి ఒక లక్ష మార్క్ దాటేశాయి.

మరోవైపు టెస్టు పాజిటివిటీ రేటు (TPR) 10 శాతానికి పడిపోయింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కేరళ సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది.

డెల్టా వేరియంట్ కనిపించిన ఆయా రాష్ట్రాల్లో తక్షణమే కంటైన్మెంట్ చర్యలు, టెస్టింగ్ నిర్వహణ, ట్రాకింగ్, జిల్లాల్లో వ్యాక్సినేషన్, క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్.. సోమవారం రోజున 77,853 శాంపిల్స్ పరీక్షించగా.. 7,499 మందికి పాజిటివ్ నిర్ధారించింది.

దాంతో టీపీఆర్ రేటు 9.63శాతంగా నమోదైంది. రాష్ట్రంలో 13,596 మందికి నెగటివ్ రాగా.. మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 27,04,554కు చేరింది. యాక్టివ్ కేసులోడ్ సంఖ్య కూడా 99,693కి చేరింది.

ట్రెండింగ్ వార్తలు