Kerala Heavy Rains : కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు పడే అవకాశం..!

రానున్న రెండు రోజుల్లో కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఏప్రిల్ 14 వరకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Kerala Heavy Rains : రానున్న రెండు రోజుల్లో కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఏప్రిల్ 14 వరకు కురిసే అవకాశం ఉందని కేరళ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని తెలిపింది.

వాయువ్య భారత్‌లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న మరో ఐదు రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఏప్రిల్ 10, 13, 14 తేదీల్లో అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ 13, 14 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ఏప్రిల్ 10, 13, 14 తేదీల్లో త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 10న పశ్చిమ బెంగాల్, సిక్కింలో కూడా వర్షపాతం నమోదయ్యే సూచన ఉందని తెలిపింది. దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, లక్షద్వీప్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం, కోస్తా, దక్షిణ కర్ణాటకలో రానున్న ఐదు రోజులలో చెదురు మదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఏప్రిల్ 10న తమిళనాడు, పుదుచ్చేరి, రైకల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 10,13, 14 తేదీల్లో కేరళలో, ఏప్రిల్ 11న తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Read Also : Jawad Cyclone : ఉత్తరాంధ్రపై జొవాద్ తుపాను ప్రభావం.. అతి భారీ వర్షాలు..తీర ప్రాంతాల్లో హైఅలర్ట్

ట్రెండింగ్ వార్తలు