Covid Cases In Kerala : కేరళలో తగ్గని కోవిడ్ ఉధృతి..కొత్తగా 12,220 కేసులు నమోదు

కేర‌ళ‌లో క‌రోనా వైరస్ ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు.

Kerala

Covid Cases In Kerala కేర‌ళ‌లో క‌రోనా వైరస్ ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు. ప్రతి రోజూ 10 వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోదవుతూనే ఉన్నాయి.

ఆదివారం కేరళలో 12,220 కొత్త కోవిడ్ కేసులు,97 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1,16,563 శాంపిల్స్ కు టెస్ట్ లు చేసినట్లు తెలిపింది. మలప్పురం జిల్లాలో అత్యధికంగా 1812 కోవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. కొత్త కోవిడ్ పేషెంట్లలో 71 మంది..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారని తెలిపింది. కొత్త కోవిడ్ పేషెంట్లలో 71 మంది..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారని తెలిపింది. రాష్ట్రంలోని 40మంది హెల్త్ వర్కర్లు కూడా కోవిడ్ బారిన పడినవారిలో ఉన్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.48శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 14,586కి చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఇంకా 1,14,844 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.