కరోనా అంటే ‘కిరీటం’ అట : అందుకే షాపుకు మహమ్మారి పేరు

  • Publish Date - November 19, 2020 / 04:22 PM IST

Kerala Shops named corona : యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ‘కరోనా’ భారత్ లోని కేరళ రాష్ట్రంలో గత ఏడేళ్ల నుంచే ఉందని మీకు తెలుసా. చైనా నుంచి అన్ని దేశాలకు వ్యాపించిన కరోనా భారత్ లోని కేరళలో తొలిసారిగి గుర్తించబడిందని తెలుసు గానీ ఏడేళ్లనుంచి కేరళలో కరోనా ఉండటమేంటీ అనే ఆశ్చర్యం కలగొచ్చు. అసలు విషయం ఏమిటంటే..కేరళలో ఏడేళ్ల నుంచి ఉన్నది కరోనా వైరస్ కాదు అది ఒక షాపు పేరు. ఓ వ్యాపారి తన షాపుకు ‘‘కరోనా’’అని పేరు పెట్టుకున్నాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే..కరోనా అంటే లాటిన్ భాషలో చాలా గొప్ప అర్థం ఉందట. కరోనా అంటే ‘కిరీటం’ అని అర్థమట.



కరోనా మాట వింటే చాలు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్న క్రమంలో కేరళలో ఉండే కరోనా కు చాలా మంచి పేరుంది. కేరళలో కొంతమందికి మాత్రం గత ఏడేళ్ల నుంచి ‘కరోనా’ పరిచయం ఉంది. జార్జ్‌ అనే ఓ వ్యాపారి తన షాపుకు పెట్టుకున్న పేరు ‘కరోనా’.




కొట్టాయమ్ కలతిప్పడి ప్రాంతంలో ఆ వ్యాపారి తన స్టోర్‌కు పెట్టిన ‘కరోనా’ పేరు అందరినీ ఆకర్షిస్తోంది. తన షాపుకు అప్పుడు ఆ పేరు పెట్టుకున్నప్పుడు జార్జ్ కు తెలీదు ఆ పేరు పెద్ద ఫేమస్ అయిపోతుందని. ఈ కరోనా సమయంలో జార్జ్ షాపుకు భలే పేరొచ్చింది. దీంతో ఆయన షాపుకకు మంచి డిమాండ్ కూడా పెరుగుతోందని జార్జ్‌ తెలిపారు.




కలతిప్పడిలో ఉన్న అతను తన షాపులో మొక్కలు, పూలకుండీలు, కుండలు, ప్రమిదలు, దీపాలతో పాటు ఇతర సామగ్రిని విక్రయిస్తాడు. ‘కరోనా’ అనే పదానికి లాటిన్‌ భాషలో ‘కిరీటం’ అని అర్థమని జార్జ్‌ తెలిపాడు. అందుకే తన షాపుకు ఆ పేరు పెట్టుకున్నానని తెలిపాడు.


అలాగే కేరళలోనే కొచ్చి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువత్తుపు సిటీలో పరీద్ అనే ఓ వ్యాపారి తన బట్టల షాపుకు ‘‘కరోనా పరీద్’ అని పేరు పెట్టుకున్నాడు. తన షాపుకు వచ్చే కష్టమర్లంతా కరోనా నిబంధనలు పాటించాలని కండిషన్ కూడా పెట్టాడు పరీద్.