కరోనా మాస్క్‌ల తయారీలో కేరళ ఖైదీల రికార్డు

  • Publish Date - March 16, 2020 / 10:41 AM IST

కోవిడ్-19 (కరోనా)వైరస్ రోజు రోజుకూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా తర్వాత అత్యంత ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడి మరణించిన దేశం ఇటలీగా తెలుస్తోంది. కరోనా ప్రభావంవల్ల అక్కడ దాదాపు 1300మందికి పైగా  మరణించారు.

జనవరిలోనే ఈవైరస్ అక్కడ గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకున్నా…కరోనా లక్షణాలు ఉన్నవ్యక్తికి సాధారణ ఫ్లూ ట్రీట్ మెంట్ చేసి ఇంటికి పంపించటంతో వ్యాధి తీవ్రత పెరిగింది.ఇప్పుడు ఇండియాలోనూ కరోనావ్యాప్తి చెందకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి అమలు చేస్తోంది.  

See Also | కరోనా లక్షణాలను దాచిపెడితే…6నెలలు జైలు శిక్ష

ఈక్రమంలో ఫేస్ మాస్క్ లకువిపరీతమైన డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ పెరగటంతో వ్యాపారస్తులు రేట్లు పెంచి బ్లాక్ లో అమ్మటం మొదలెట్టారు.   మాస్క్ ల కొరత తీర్చటానికి  కేరళకు చెందిన ఖైదీలు  తమ వంతు కృషి చేస్తున్నారు.  

కేరళలోని ఖైదీలు రెండు రోజుల్లో 6వేల మాస్క్ లు కుట్టారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తన ట్వి్ట్టర్ లో పోస్టు చేశారు.  వీటిని ఆరోగ్య శాఖకు అందించారు.  రెండు లేయర్లు కలిగిన ఈ కాటన్ మాస్క్ లను తిరిగి ఉపయోగించవచ్చు.  వీటి ధర రూ.15 నుంచి రూ.20 వరకు నిర్ణయించారు. 

See Also | కరోనా ఐసోలేషన్ వార్డుల నుంచి భారతీయులు ఎందుకు పారిపోతున్నారంటే?