Tomato Flu Virus : కేరళలో టమాటా ఫ్లూ కలకలం..దాదాపు 10 కేసులు నమోదు

కేరళలో ‘టమాటా ఫ్లూ’ వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రమాదకరమైన ఈ వైరస్ తో 80మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Kerala registers new cases of Tomato Flu Virus : దాదాపు మూడేళ్ల నుంచి కోవిడ్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లుగా మారి ఈనాటికి భయపెడుతునే ఉంది. ఈక్రమంలో కేరళలో మరో వైరస్ భయపెడుతోంది. ‘టమాటా ఫ్లూ’ వైరస్ తో బాధపడుతు పలువురు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా బయటపడకముందే తాజాగా టమాటా వైరస్ రూపంలో హడలెత్తిస్తోంది. కేరళలో వెలుగు చూసిన ‘టమాటా ఫ్లూ’ వైరస్ తో పలువురు చిన్నారులు తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలు, ఇతర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రమాదకర ఈ వైరస్ కారణంగా కొల్లాంలో 80 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారు. టమాటా ఫ్లూ సోకిన చిన్నారులంతా ఐదేళ్ల వయస్సువారే కావటం గమనించాల్సిన విషయం.

అత్యంత అరుదైన ఈ వ్యాధి సోకితే చర్మంపై ఎర్రటి బొబ్బలు వస్తాయి. అవి టమాటా ఆకారంలో ఉండడంతోనే దానికి టమాటా వైరస్ గా పేరు పెట్టారు నిపుణులు. ఈ ఫ్లూ బారినపడిన వారిలో తీవ్రమైన జ్వరం, నీరసం, ఒళ్లు నొప్పులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. మరికొందరు చిన్నారుల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, చేతులు, మోకాళ్లు, పిరుదులు రంగు మారుతాయని నిపుణులు సూచించారు.కాగా కేరళలో టమాటా ఫ్లూ కేసులు నమోదు కావటంతో కర్ణాటక హై అలర్ట్ ప్రకటించింది.

టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వరం అనేది ఒక ప్రాణాంతక వైరస్. ఇది దేశంలోని దక్షిణ భాగంలో ఎక్కువగా కనుగొనబడింది. దీనిని నివారించడానికి ఆయా ప్రాంతాల్లోని అగన్‌వాడీ కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఈ టమాటా ఫ్లూ వైరస్ గురించి అవగాహనకు 24 మంది సభ్యుల బృందం పనిచేస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తోంది. వైద్య బృందాలు ఇన్ఫెక్షన్‌ను గుర్తించడానికి పిల్లలకు జ్వరం పరీక్షలు చేస్తున్నాయి. ప్రధానంగా ఈ వైరస్ ఐదేళ్ల లోపు పిల్లలపై దాడి చేస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వారి చర్మంపై ఎర్రటి గుండ్రని బొబ్బలు ఏర్పడతాయి, అందుకే దీనిని టొమాటో ఫ్లూ అని పిలుస్తున్నారు.

ప్రస్తుతం కొల్లాంకే పరిమితమైన ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని కేరళ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కేరళలో ఈ ఫ్లూ వెలుగు చూడడంతో తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే పరీక్షలు చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతోపాటు శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా చూసుకోవడం ద్వారా టమాటా వైరస్‌కు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

టొమాటో ఫ్లూ వైరస్ లక్షణాలు..

తీవ్ర జ్వరం
డీహైడ్రేషన్
శరీర నొప్పి
దద్దుర్లు
పొక్కు
వాపు
తిమ్మిరి
వాంతులు అవుతున్నాయి
తుమ్ములు
జలుబు
అలసట
నోటిలో చికాకు
చేతులు, కాళ్లు మరియు శరీరంలోని ఇతర భాగాలలో రంగు మారడం

ట్రెండింగ్ వార్తలు