Membership Drive: మద్యం, డ్రగ్స్‌ తీసుకోనివారికే సభ్యత్వం.. కాంగ్రెస్ కీలక నిర్ణయం!

కాంగ్రెస్ మెగా సభ్యత్వ నమోదుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి సభ్యత్వ నమోదు విషయంలో కీలకమైన నిబంధనలు విధించేందుకు పార్టీ సిద్ధం అవుతోంది.

Congress (1)

Membership Drive: కాంగ్రెస్ మెగా సభ్యత్వ నమోదుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి సభ్యత్వ నమోదు విషయంలో కీలకమైన నిబంధనలు విధించేందుకు పార్టీ సిద్ధం అవుతోంది. పార్టీలో చేరాలనుకుంటే, మద్యం, డ్రగ్స్‌ తీసుకోమని డిక్లరేషన్ ఇవ్వాలని, అలా ఇచ్చినవారికే సభ్యత్వం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ తీసుకునే నిర్ణయాలు, అంశాలను బహిరంగంగా విమర్శించమని ముందుగానే డిక్లరేషన్‌ ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది కాంగ్రెస్.

కొత్తగా చేరే వారు వీటికి ఒప్పుకుంటేనే పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. కాంగ్రెస్‌ సభలు, సమావేశాలకు తప్పకుండా రావాలని నిబంధనలు విధించింది. సమాజంలో సామాజిక న్యాయం పాటిస్తానని, పార్టీ కోసం ఓ కార్మికుడిగా పనిచేస్తానని ప్రమాణం చేయాలని నిబంధనలు విధించింది. మొత్తం పది పాయింట్ల డిక్లరేషన్‌తో కొత్తగా సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మెంబర్ షిప్‌ డ్రైవ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

వచ్చే ఏడాది మార్చ్‌ 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనుండగా.. 26వ తేదీన కీలక సమావేశంలో మెంబర్ షిప్‌ విధివిధానాలపై చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నికపై కసరత్తు ప్రారంభం అవుతుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన CWC సమావేశంలో అధ్యక్ష ఎన్నికపై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఎన్నిక ఉంటుంది.