బాల్య వివాహాలు వద్దన్నందుకు వృద్ధుడుని 12 సంవత్సరాలు బహిష్కరించిన పంచాయతీ పెద్దలు

  • Publish Date - October 18, 2020 / 11:23 AM IST

Khap panchayat orders : బాల్య వివాహాలు వద్దన్నందుకు 65 సంవత్సరాల వృద్ధుడు కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు పంచాయతీ పెద్దలు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో Chittorgarh జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై 21 సభ్యులపై కేసు బుక్ చేశారు.



Nimbahera ప్రాంతంలో శివలాల్ 65 సంవత్సరాల వృద్ధుడి కుటుంబం నివాసం ఉంటోంది. సెప్టెంబర్ 30వ తేదీన khap panchayat సభ్యులు ఓ సమావేశం నిర్వహించారని శివలాల్ వెల్లడించాడు. తన కుటుంబానికి ‘hukka pani bandh’ ఆదేశాన్ని పంచాయితీ ఆమోదించిందని, దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే…వారికి రూ. 1.10 లక్షల జరిమాన విధించడం జరుగుతుందని పంచాయతీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారని తెలిపాడు.



Mahadev temple లో జులై 30వ తేదీన పంచాయతీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారని, బాల్య వివాహాలు, mrityubhoj in the community కొనసాగించడంపై అభిప్రాయాలు వ్యక్తం చేయాలని కోరారని వెల్లడించాడు. ఈ రెండు నిర్ణయాలకు తాను వ్యతిరేకంగా నిలబడడం జరిగిందన్నారు.



నిర్ణయాన్ని రిజర్వ్యు చేయబడిందని, తదుపరి సమావేశం సెప్టెంబర్ 30వ తేదీన నిర్ణయించారని వెల్లడించారు. ఆ రోజున సమావేశం జరిపి..తన కుటుంబాన్ని 12 సంవత్సరాల పాటు సామాజిక బహిష్కరణ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు బుక్ చేశారు పోలీసులు.