PM Modi : వాళ్ల ప్రియారిటీ అదొక్కటే..హిమాచల్ పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ ఫైర్
హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-27,2021)ఆ రాష్ట్రంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా

Modi
PM Modi : హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-27,2021)ఆ రాష్ట్రంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ధౌలా సిద్ధు హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌ను ప్రధాని ప్రారంభించారు. రూ.11వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
హిమాచల్ ప్రదేశ్ పర్యటన సందర్భంగా మండీలోని పడ్డాల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ…”దేశంలో అతి ముఖ్యమైన ఫార్మా హబ్ లలో హిమాచల్‌ప్రదేశ్ ఒకటి. కోవిడ్-19 సమయంలో హిమాచల్ ప్రదేశ్..ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా చాలా దేశాలకు సాయమందించింది. నేటికి హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి నాలుగేళ్లు పూర్తి అయింది. బీజేపీ ప్రభుత్వం కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగవు. ప్లాస్టిక్ కారణంగా పర్వాతాలకు కలుగుతున్న నష్టం పట్ల బీజేపీ ప్రభుత్వం అలర్ట్ గా ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాప్త క్యాంపెయిన్ తో పాటుగా,ప్లాస్టిక్ వేస్ట్ మేనెజ్ మెంట్ పై కూడా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది”అని మోదీ తెలిపారు.
ఇక,ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మోదీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ “ఓ కుటుంబానికి సేవ”మాత్రమేనని,కానీ బీజేపీ… సబ్ కా సాథ్,సబ్ కా విశ్వాస్,సబ్ కా విశ్వాస్ సిద్ధాంతంతో పనిచేస్తోందని మోదీ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సబ్ కా సాథ్,సబ్ కా విశ్వాస్,సబ్ కా విశ్వాస్ మోడల్ పై పనిచేస్తోందని,రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసిందని తెలిపారు.
అంతకుముందు మండీలోనే నిర్వహించిన హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రెండో సదస్సులో మోదీ పాల్గొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మండీలో రూ.28,197 కోట్ల విలువైన 287 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.28వేల కోట్లు విలువైన 287 ప్రాజెక్టుల ప్రారంభం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకుంటాయని అధికార వర్గాలు తెలిపాయి.
ALSO READ AP High Court : ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆ రెండు జీవోలు కొట్టివేసిన హైకోర్టు