ఓటమెరుగని యోధుడు : కేరళ కాంగ్రెస్ చైర్మన్ KM మణి కన్నుమూత

 సీనియర్ పొలిటిషయన్, కేరళ కాంగ్రెస్(M)చైర్మన్ కేఎమ్ మణి(86) కన్నుమూశారు.కొంతకాలంగా ఛాతీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం(ఏప్రిల్-9,2019)కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.1965లో పాలా నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం నిరాటంకంగా కొనసాగింది.ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఆయన ఓడిపోలేదు. ఇప్పటివరకు కేరళ శాసనసభలో అత్యధికంగా 13 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.మణికి భార్య కుట్టియమ్మ,కుమారుడు జోసే కే మణి(రాజ్యసభ ఎంపీ),కూతుళ్లు ఎల్సా,అన్నీ,సల్లి,టెస్సీ,స్మితా ఉన్నారు.

మణి మృతి పట్ల కేరళ సీఎం పిన్నరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు.రాష్ట్రం కోసం ఆయన అలుపెరుగని సేవ చేశారన్నారు.కేరళ రాజకీయ జీవితానికి ఆయన మరణం ఓ లోటు అని విజయన్ అన్నారు.మణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రధాని మోడీ కూడా మణి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.కేరళ రాజకీయాల్లో ధైర్యసాహసాలు కలిగిన నేత మణి అని మోడీ అన్నారు.కేరళ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారన్నారు.ఆయన కుటుంబసభ్యులకు,మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.