తాటతీస్తున్నారు : కలకత్తాతో ఆకతాయిల ఆట కట్టిస్తున్న మహిళా పోలీస్  

  • Publish Date - December 9, 2019 / 08:42 AM IST

కలకత్తాలో మహిళా పోలీసుల టీమ్ ఆకతాయిల పాలిట అపర కాళికల్లా మారారు. మహిళల్ని వేధిస్తు తాట తీస్తామంటున్నారు. జనసముద్రంలా ఉండే కలకత్తా నగరంలోని పార్కులు..హాస్పిటల్స్, బస్టాండ్స్, కాలేజీలు వంటి పలు ప్రాంతాలలో  యువతుల్ని, మహిళల్ని ఈవ్ టీజంగ్ చేస్తూ వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు మహిళా పోలీసులు.

నగరంలోని విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్ రోడ్డులో మహిళలను వేధిస్తున్న ఆరుగురు ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. ‘‘విన్నర్స్’ పేరుతో పోలీస్ శాఖ మహిళా పోలీస్ ఆఫీసర్స్ ను నియమించింది. వీరు నగరంలోని పలు ప్రాంతాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ..యువతులు..మహిళలను వేధిస్తున్నవారిని అదుపులోకి తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. మరోసారి ఆడవారి జోలికి వస్తే..సెల్ లో వేసి కుమ్మేస్తామంటున్నారు. పెట్రోలింగ్ ద్వారా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ‘‘విన్నర్స్’ ఉమెన్ పోలీస్ టీమ ఇప్పటికే 74మందిని అరెస్ట్ చేశారు.  

ఈ సందర్భంగా కలకత్తానగర పోలీసు కమిషనర్ అనుజ్ శర్మ ఆదివారం (డిసెంబర్ 8) ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ..మహిళలు బాధలో ఉన్నా..వేధింపులకు గురౌవుతున్నా..100 నంబర్ డయల్ చేయమని సూచించారు. వెంటనే పోలీసుల్ని సంప్రదించండి. కాల్ చేసినవారి వివరాలను రహస్యంగా ఉంచుతామని తెలిపారు. శర్మ ట్వీట్ చేస్తూ..మీకు ఎవరైనా హాని తలపెబుతున్నారనే అనుమానాలు ఉన్నా..లేదా అనుమానాస్పద వ్యక్తులు..అనుమానాస్పద విషయం మీ దృష్టికి వచ్చినా.. దయచేసి వెంటనే 100 నంబర్‌కు కాల్ చేసి మాకు తెలియజేయమని సూచించారు. మీకోసం మేము అనుక్షణం అప్రమత్తంగా ఉంటామని భరోసానిచ్చారు.

పశ్చిమ బెంగాల్ సీఎం  మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మహిళలపై హింస ఫిర్యాదులను ఎటువంటి ఆలస్యం చేయకుండా దాఖలు చేయాలని అన్ని పోలీసు స్టేషన్లను ఆదేశించారు. ఇటువంటి  కేసుల్లో ఫిర్యాదులు నమోదు చేయడానికి నిరాకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం నాడు  కోల్‌కతా పోలీసులు నగరంలోని పలు ప్రాంతాలల్లో 74 మందిని అరెస్టు చేశారు.