Kumar Mangalam Birla : వొడాఫోన్-ఐడియా డైరక్టర్ పదవి నుంచి వైదొలిగిన బిర్లా

టెలికాం దిగ్గజ సంస్థ "వొడాఫోన్ ఐడియా(VIL)" నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి బుధవారం కుమార్ మంగళం బిర్లా తప్పుకున్నారు.

Birla

Kumar Mangalam Birla టెలికాం దిగ్గజ సంస్థ “వొడాఫోన్ ఐడియా(VIL)” నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి బుధవారం కుమార్ మంగళం బిర్లా తప్పుకున్నారు. బిర్లా రాజీనామాని ఇవాళ జరిగిన మీటింగ్ లో సంస్థ బోర్డు డైరక్టర్లు ఆమోదించారని వీఐఎల్ తెలిపింది.

READVodafone Idea Stake : బిర్లా సంచలన నిర్ణయం..ప్రభుత్వం చేతికి వొడాఫోన్-ఐడియా!

బిర్లా రాజీనామాతో..ఆదిత్య బిర్లా గ్రూప్ నామినీ,25 ఏళ్ల పాటు టెలికాం ఇండస్ట్రీలో అనుభవమున్న హిమాన్షు కపానియాని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్,నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బోర్డు డైరక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వీఐఎల్ తెలిపింది. కపానిమా..గతంలో గ్లోబల్ GSMA బోర్డులో రెండేళ్లు మరియు రెండేళ్ల పాటు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(COAI)చైర్మన్ గా పనిచేశారని,ప్రస్తుతం టెలికాం,ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ ఎకానమీ కి సంబంధించిన FICC కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నారని వీఐఎల్ ఓ ప్రకటనలో తెలిపింది.