Kerala: రూ.75 లక్షల లాటరీ గెలిచిన ఆనందంలో.. పోలీస్ స్టేషన్‭‭కు పరుగులు తీసిన వలస కార్మికుడు

ఎర్నాకులంలోని చోట్టనికర ప్రాంతంలో నిర్మాణ రంగంలో కాంక్రీట్ పని చేస్తుంటాడు బాదేశ్. అతడు కేరళ వెళ్లి అంత ఎక్కువ కాలం ఏం కాలేదు. పైగా మలయాళం కూడా తెలియదు. అతడి స్నేహితుడు కుమార్ సహాయంతో అక్కడ పని చేస్తున్నాడు. అతడికి కనుక ఈ లాటరీ డబ్బులు చేతికి అందితే బెంగాల్ లోని స్వస్థలానికి వెళ్తానని ప్లాన్ చేసుకుంటున్నాడు

Kerala: ఒక వలస కార్మికుడికి తాజా లాటరీలో 75 లక్షల రూపాయలు వచ్చాయి. ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బైన అతడికి వెంటనే టికెట్ ఏమైనా అవుతుందనే భయం వేసింది. అంతే.. వెంటనే లాటరీ టికెట్ చేత బూని పోలీస్ స్టేషన్ వైపు పరుగు తీశాడు. స్టేషన్ చేరుకుని, తనకు వచ్చిన లాఠరీ గురించి చెప్పి భద్రత కల్పించాలని కోరాడు. కేరళలోని బువట్టుపుజలో జరిగింది ఇది. అతడు బెంగాల్‭కు చెందిన వ్యక్తి. పేరు ఎస్.కే బాదేశ్. బతుకుదెరువుకని కేరళ వచ్చి, అక్కడే కూలీగా పని చేస్తున్నాడు.

Secunderabad Cantonment Board : సికింద్రాబాద్ సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు

అయితే అతడు కొద్ది రోజుల క్రితం కేరళ ప్రభుత్వం నడిపిస్తున్న స్త్రీ శక్తి లాటరీ కొనుగోలు చేశాడు. తాజాగా అది 75 లక్షల రూపాయలు గెలుచుకోవడంతో అంతు పట్టలేని ఆనందం, ఆ వెంటనే భయం తన్నుకొచ్చాయి. అతడికి డబ్బు తీసుకునే వరకు ఉండే ఫార్మాలిటీస్ భయంతో పాటు తన లాటరీని ఎవరైనా దొంగిలిస్తారనే భయం కూడా పెరిగింది. పోలీసులు అతడి పరిస్థితిని అర్థం చేసుకుని.. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, డబ్బు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే బదేశ్ గతంలో ఒకసారి ఇలాగే లాటరీ గెలుచుకున్నాడు. కానీ డబ్బు అందలేదు. ఆ భయం పట్టుకుంది. అందుకే ఈసారి పోలీస్ స్టేషన్ తలుపు తట్టాడు.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు 6 రోజుల పోలీస్ కస్టడీ

ఎర్నాకులంలోని చోట్టనికర ప్రాంతంలో నిర్మాణ రంగంలో కాంక్రీట్ పని చేస్తుంటాడు బాదేశ్. అతడు కేరళ వెళ్లి అంత ఎక్కువ కాలం ఏం కాలేదు. పైగా మలయాళం కూడా తెలియదు. అతడి స్నేహితుడు కుమార్ సహాయంతో అక్కడ పని చేస్తున్నాడు. అతడికి కనుక ఈ లాటరీ డబ్బులు చేతికి అందితే బెంగాల్ లోని స్వస్థలానికి వెళ్తానని ప్లాన్ చేసుకుంటున్నాడు. తన ఇంటిని బాగు చేసుకుని, వ్యవసాయ పొలాన్ని విస్తరించుకుని అక్కడే వ్యవసాయం చేస్తూ బతకాలని అతడి కోరిక.

ట్రెండింగ్ వార్తలు