Punjab Politics : పంజాబ్ పీసీసీ చీఫ్ గా లాల్ సింగ్!

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది.

Punjab Politics  పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన “లాల్ సింగ్”ని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. పంజాబ్ మాజీ ఆర్థికశాఖ మంత్రి లాల్ సింగ్ గతంలో పలు ప్రభుత్వ మరియు ఆర్గనైజేషనల్ పదవులను నిర్వహించారు. మాజీ సీఎం అమరీందర్ సింగ్ కి “లాల్ సింగ్” దగ్గరి సన్నిహితుడు.

ప్రస్తుతం లాల్ సింగ్.. పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డ్ చైర్మన్ మరియు పంజాబ్ పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. 1977లో లాల్ సింగ్ తొలిసారిగా ఢాకాలా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి 2012 వరకు ఐదుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985,1997 ఎన్నికల్లో శిరోమణీ అకాలీదల్ పార్టీ అభ్యర్ధుల చేతిలో లాల్ సింగ్ ఓడిపోయారు. 2012లో సనౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు లాల్ సింగ్.

ALSO READ మళ్లీ కళంకిత పంజాబ్‌గా మార్చొద్దు… రాజీనామాపై సిద్దూ స్పందన

మరోవైపు,పంజాబ్ పీసీసీ చీఫ్ ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ మదిలో మరికొన్ని పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్, ఆనంద్ పూర్ సాహిబ్ ఎంపీ మనీష్ తివారీ,లుధియానా ఎంపీ మరియు అమరీందర్ సింగ్ క్యాంప్ కి చెందిన  రవనీత్ సింగ్ బిట్టూ,అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన ప్రతాప్ సింగ్ బజ్వా పేర్లు కూడా పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి ఎంపిక కోసం వినబడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు