కిడ్నీలు పాడైపోయాయ్: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన లాలూ

  • Publish Date - September 1, 2019 / 04:37 AM IST

రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(71) అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ సైతం నిలకడగా లేవని డాక్టర్లు చెబుతున్నారు.

పశుగ్రాసం కుంభకోణం కేసులో దోషిగా తేలి బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(రిమ్స్‌) ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి సీనియర్‌ డాక్టర్‌ ఉమేశ్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఆయన కిడ్నీ 63 శాతం దెబ్బతినగా, 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఆహారం తీసుకునే పరిస్థితి కూడా చాలావరకు తగ్గిందని, ప్రస్తుతం మందులు ఇస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉంటున్నారు.