డిసెంబర్ 31 లాస్ట్ డేట్ : త్వరపడండి
పాన్ కార్డుకు ఆధార్‌ను లింక్ చేయడానికి 2019, డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు డెడ్‌లైన్ విధించింది.

పాన్ కార్డుకు ఆధార్‌ను లింక్ చేయడానికి 2019, డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు డెడ్‌లైన్ విధించింది.
పాన్ కార్డుకు ఆధార్‌ను లింక్ చేయడానికి 2019, డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికే అనేకసార్లు డెడ్‌లైన్ విధించింది. ఏడుసార్లు చివరి తేదీలను పొడిగించింది. అయినా ఇంకా చాలా మంది పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయలేదు. దీంతో ఈ నెల 31 వరకు గడువు ఆదాయపన్నుశాఖ గతంలోనే పొడిగించింది.
ఈ సారి ప్రభుత్వం చివరి తేదీని పొడిగించే అవకాశం కనిపించడం లేదు. కచ్చితంగా డిసెంబర్ 31లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. లేకపోతే వారి పాన్ కార్డులు చెల్లబోవని చెబుతోంది. ఆధార్ లింక్ చేయని పాన్‌కార్డులు ఉపయోగించడానికి వీల్లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రకటించనుంది. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి 4 మార్గాలున్నాయి.
పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్.. 4 మార్గాలు
1. SMS: మీరు మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.
UIDPAN<space><12 అంకెల ఆధార్><space><10 అంకెల పాన్>
2. Online: ముందుగా incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ‘Linking Aadhaar’ లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘Link Aadhaar’ పైన క్లిక్ చేస్తే మీ పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
3. Income Tax Returns (ITR): మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.
4. PAN Card Application: ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ వివరిస్తే సరిపోతుంది.