Dolly Kumari was the last Kashmiri Pandit in Shopian district's Chaudharygund village
Migration of Kashmiri Pandits to Jammu : కశ్మీర్ అనగానే పండిట్లు గుర్తుకొస్తారు. అటువంటి కశ్మీర్ పండిట్లు ప్రాణభయంతో కశ్మీర్ లోయను వదిలిపోతున్నారు. భయం గుప్పిట్లో బతకలేక..పుట్టి పెరిగిన కశ్మీర్ లోయను వదల్లేక మానసిక వేధనతో కొట్టుమిట్టాడుతూ..జమ్ముకు వలసపోతున్నారు. ఇప్పటికే చాలామంది కశ్మీర్ వదిలి జమ్ముకు చేరుకున్నారు కశ్మీర్ పండిట్ కుటుంబాలు. కానీ కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన ఓ మహిళ మాత్రం కశ్మీర్ నే అంటిపెట్టుకుని ఉంది ఇప్పటి వరకు. ఆమే పేరు డాలీ కుమారి. కానీ ఆమె కశ్మీర్ లో ఉన్న ఏకైన పండిట్ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె కూడా చివరకు కశ్మీర్ లోయను వదిలి జమ్మూకి వలస వెళ్లిపోయింది. షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామంలో తన కుటుంబంతో కలిసి వుంటున్న డాలీ గురువారం సాయంత్రం లోయను విడిచిపెట్టింది. ఆమె జమ్మూకి వలస వెళ్లింది.
ఇటీవల కశ్మీర్ లోయలో పండిట్ లను టార్గెట్ చేస్తు దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు చౌదరిగుండ్, చోటిపొర గ్రామాల్లో కశ్మీర్ పండిట్ కుటుంబాల ఇళ్లకు తాళాలు వేసుకుని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పోతున్నారు. అలా ఎన్నో కుటుంబాలు తరలిపోయాయి. కానీ డాలి మాత్రం కశ్మీర్ ను వదలిపెట్టి వెళ్లలేక ఉండిపోయింది. అయినా దాడులు ఆగకపోవటంతో జీవించి ఉంటే ఎప్పుడైనా కశ్మీర్ కు తిరిగి రావచ్చనే ఆశతో జమ్ముకు వలస వెళ్లిపోయింది.
షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామంలో నివసిస్తున్న ఏడు పండిట్ కుటుంబాలపై దాడి చేసి వారిని హత్య చేయడంతో జమ్మూకి వలసలు పోవటం జరుగుతోంది. భయంతో ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు దాడులు చేస్తారోనని భయపడుతూ బతకడం ఇష్టంలేకనే జమ్మూ వెళ్లిపోవటానికి సిద్ధపడ్డానని డాలీ ఉద్వేగంగా వెల్లడించింది. మిగతా కశ్మీరీ పండిట్‌లందరూ గ్రామాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలని తాను నిర్ణయించుకున్నానని..కానీ ఎంత ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వాపోయింది. కన్నతల్లిలాంటి కశ్మీర్ లోయను వదిలిపోతుంటే ప్రాణాలు పోయింనత బాధగా ఉందని కన్నీటితో వెల్లడించింది.
ఇక్కడి పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తానని..అటువంటి శుభపరిణామం త్వరగా రావాలని ఆకాంక్షించింది డాలి కుమారి.‘కశ్మీర్ నేను పుట్టి పెరిగిన నా ఇల్లు. సొంతింటిని ఎవరు విడిచిపెట్టాలనుకుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఇష్టపడతారు. నేను నా ఇల్లు వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది..అతి త్వరగా తిరిగి రావాలని చాలా ఆశగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది డాలీ.
అక్టోబర్ 15న చౌదరిగుండ్ గ్రామంలో కశ్మీరీ పండిట్ పురాణ్ క్రిషన్ భట్ తన ఇంటి బయటే హత్యకు గురయ్యాడు. రెండు నెలల క్రితం పక్కనున్న చోటిపొర గ్రామంలో యాపిల్ తోటలో కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఇటువంటి భయానక పరిస్థితుల్లో ఇక్కడ ఎలా ఉండగలుగుతాం అందుకే ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా తిరిగి రావచ్చు కదా..ఆ ఆశతోనే కశ్మీర్ వదిలివచ్చేసానని తెలిపింది డాలీ..కాగా చివరి పండిట్ మహిళ కూడా జమ్ముకు వలసపోయిన దుస్థితి నెలకొనటంతో కశ్మీర్ లోయలో..కశ్మీర్ లోయలో పండిట్ల కుటుంబాలు నివసించే ఇళ్లకు తాళాలు వేలాడుతూ కశ్మీర్ భద్రతను వెక్కిరిస్తున్నాయి.
ప్రస్తుతం చౌదరిగుండ్ గ్రామంలోని పండిట్ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. వారు తమ తోటల్లోని యాపిల్ అమ్మాల్సి ఉంది కానీ..వాటిని అమ్ముకోవటానికి కూడా గ్రామానికి తిరిగి రావాలని అనుకోవడం లేదు. కారణం ప్రాణభయం.గ్రామంలో వేల సంఖ్యలో యాపిల్ బాక్సులను విడిచిపెట్టారు. చౌదరిగుండ్, చోటిపొర గ్రామాల్లో 11 పండిట్ కుటుంబాలు ఉండేవి. వీరంతా జమ్మూకు వలస వెళ్లారు. కానీ దాడులకు..హత్యలకు భయపడి పండిట్ కుటుంబాలు వెళ్లిపోతున్నాయరనే వార్తలను అధికారులు ఖండిస్తున్నారు. ఇవన్నీ తప్పుడు వార్తలనీ..ఇక్కడి పండిట్ లకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసామని చెబుతున్నారు.