Leopard
Leopard : కోతిని వేటాడేందుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన చిరుతపులి విద్యుదాఘాతంతో మరణించింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ కోతిని వేటాడేందుకు చిరుతపులి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కింది. కోతితోపాటు చిరుతపులి రెండు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చంద్రాపూర్ సమీపంలోని సిందేవాహి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Also Read : Diwali bonus : టీ ఎస్టేట్ ఉద్యోగులకు దీపావళి బోనస్… రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్
అటవీ శాఖ, విద్యుత్ శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుదాఘాతంతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. జంతువులను అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌పై నుంచి దించారు.
Also Read : Onions : మొబైల్ వాహనాల్లో సబ్సిడీ ఉల్లి విక్రయం…కిలో ధర ఎంతంటే…