Leopard Tension In Karnataka : కర్ణాటక బెళగావిలో మళ్లీ చిరుతపులి ప్రత్యక్షం..22 స్కూళ్లకు సెలవు!

కర్ణాటకలోని బెళగావిలో మరోసారి చిరుతపులి కలకలం చెలరేగింది. బెళగావితోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు తిరిగి.. అదృశ్యమైన చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. బెళగావి గోల్ఫ్‌ కోర్సు దగ్గర రెండుసార్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leopard Tension In Karnataka : కర్ణాటకలోని బెళగావిలో మరోసారి చిరుతపులి కలకలం చెలరేగింది. బెళగావితోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు తిరిగి.. అదృశ్యమైన చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. బెళగావి గోల్ఫ్‌ కోర్సు దగ్గర రెండుసార్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈనెల 5న ఓ కార్మికుడిపై దాడి చేసి అదృశ్యమైన చిరుత… అప్పటి నుంచి వెతుకుతున్న అటవీ అధికారులకు చిక్కలేదు.

దాదాపు మూడు వారాల తర్వాత రోడ్డు దాటుతూ బస్సు డ్రైవర్లకు కనిపించింది. మిటరీ క్యాంపు సమీపంలో చిరుత క్లబ్‌ రోడ్డు దాటుతున్న దృశ్యాలను బస్సు డ్రైవర్లు తమ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిరుత సంచారం సమాచారం తెలియడంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని 22 పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Leopard : చిరుతపులి సంచారం-భయంతో వణుకుతున్న ప్రజలు

అప్పటికే కొన్ని పాఠశాలలకు విద్యార్థులు రావడంతో… వారిని తీసుకెళ్లాలంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. చిరుతపులి కాలిబాటపై దాదాపు 200 మీటర్ల మేర పరుగులు పెట్టినట్టుగా గుర్తించారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. గోల్ఫ్‌ కోర్సు నుంచి పారిపోయిన చిరుత మిలటరీ క్యాంపులోని పొదల వైపు వెళ్లినట్టు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు