Lic, Sbi, Hdfc And Pnb Home Loans
LIC, SBI, HDFC and PNB home loans: : సొంతిళ్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే హోంలోన్ కావాల్సిందే.. తక్కువ వడ్డీకే రుణాలు ఎవరిస్తారా? అని చూస్తున్నారా? ఈ బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటున్నాయి. అంతేకాదు.. ప్రాసెసింగ్ ఫీజులు కూడా లేదట.. సొంతిల్లు కళను నెరవేర్చుకోవాలంటే ముందుగా ఏయే బ్యాంకుల్లో రుణాలిస్తున్నాయో చూడాలి. అలాగే ఆ బ్యాంకుల్లో తీసుకునే రుణంపై ఎంత వడ్డీని అందిస్తున్నాయో కూడా తెలిసి ఉండాలి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM)ఇళ్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను కూడా మాఫీ చేశాయి. ఒక్క SBI మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. PNB, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు వచ్చేనెల 30వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేశాయి. ఏయే బ్యాంకుల్లో ఎంతవరకు రుణాన్ని ఇస్తున్నాయో ఓసారి పరిశీలిద్దాం..
ఏయే బ్యాంకు వడ్డీ ఎంతంటే? :
ప్రైవేట్ బ్యాంకు కోటక్ మహీంద్రా 6.65 శాతం వడ్డీరేటుకే హోం లోన్లను అందిస్తోంది. LIC అనుబంధ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా 6.66 శాతానికి ఇంటి రుణాలను అందిస్తోంది. పలు బ్యాంకులు ఏడు శాతం లోపు వడ్డీరేటుకే రుణాలను అందిస్తున్నాయి. రూ. 10 లక్షల రుణంపై 20ఏళ్ల కాల పరిమితి పెట్టుకుంటే ఎన్ని ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. 20ఏళ్లలో అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి రుణాలు తీసుకునే ముందు ఈ నాలుగు విషయాలను బాగా గుర్తించుకోవాలి. ఐసీఐసీఐ 6.70, ఎస్బీఐ 6.70, పీఎన్బీ 6.80 వడ్డీలను విధిస్తున్నాయి.
ఇంటి లోను కావాలంటే తక్కువ మొత్తం రుణానికి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. సొంతింటి నిర్మాణానికి భారీగా డబ్బులు పెట్టాలి. తక్కువ రుణం కోసం అప్లయ్ చేసుకున్నప్పుడు మీరు కొనే ఆస్తిలో కొనుగోలు దారు భాగస్వామ్యం ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు బ్యాంక్ రిస్క్ తగ్గుతుంది. రుణం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంటి స్థలం విలువలో 75శాతం నుంచి 90 శాతం వరకు బ్యాంకులు హోంలోన్లు అందిస్తున్నాయి. మిగతా మొత్తం రుణ గ్రహీత డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మార్జిన్ కంట్రిబ్యూషన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మీకు హోం లోను బ్యాంకులు ఇచ్చేందుకు ముందుకు రావు.
హోం లోను అప్లయ్ చేస్తే :
హోం లోను కోసం అప్లయ్ చేసినప్పుడు బ్యాంకు మీకు ఫిక్స్‌డ్‌గా వచ్చే ఆదాయ నిష్పత్తి (FOIR)ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి నెలా ఎంత మేరకు EMIలు చెల్లిస్తారో పరిశీలిస్తుంది. తద్వారా మీ ఆదాయ నిష్పత్తి తెలుస్తుంది. మీరు చెల్లించే రుణ చెల్లింపులు, ఇంటి అద్దె, బీమా పాలసీలు, ఇతర చెల్లింపులన్నీ మీ ఆదాయం కిందకు వస్తాయి. అందులో 50 శాతం ఖర్చులే ఉంటే బ్యాంకులు మీకు రుణాలు ఇవ్వవని గుర్తించుకోవాలి. అందుకే హోం లోన్ అప్లయ్ చేసే ముందే ఎంత రుణం కావాలో నిర్ణయించుకోవాలి. లోన్ పేమెంట్ విషయంలో ముందుగా ప్రీ పేమెంట్ చేస్తే.. పలు బ్యాంకులు లేవీ విధించవచ్చు. ముందుగా పేమెంట్ చేయడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీరేటుకే చెల్లించవచ్చు.
అప్పుడు తాత్కాలిక కండీషన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి హోం లోన్ తీసుకోవడానికి ముందే పూర్తిస్థాయిలో సమాచారం తెలిసి ఉండాలి. మరో విషయం ఏంటంటే.. మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకులోనే హోం లోన్ తీసుకోవాలి. క్రెడిట్ కార్డు సర్వీసుతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్న బ్యాంకులో కూడా హోం లోన్ తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా బ్యాంకులు తమ రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే రీజనబుల్ వడ్డీరేట్లపై లోన్లు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా హోం లోన్ కోసం ప్రయత్నిస్తుంటే.. వెంటనే అప్లయ్ చేసుకోండి.. సొంతంటి కలను నెరవేర్చుకోండి.