Prashant kishor : ఆ రాజకీయ నాయకుడు అంటే ప్రశాంత్ కిషోర్‌కు అమితమైన ఇష్టమట.. ఎవరా నేత?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటే దేశ రాజకీయాలపై అవగాహన కలిగిన ప్రతిఒక్కరికి తెలిసిన పేరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ తెలియని వారు ఉండకపోవచ్చు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో ...

Prashant kishor : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటే దేశ రాజకీయాలపై అవగాహన కలిగిన ప్రతిఒక్కరికి తెలిసిన పేరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ తెలియని వారు ఉండకపోవచ్చు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. వైసీపీ గెలుపులో కీలక భూమిక పోషించారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకున్నాడన్న వార్తలు షికార్లు చేశాయి.

Prashant Kishor: బిహార్ ఇంకా వెనుకబడిన రాష్ట్రమే: పీకే

జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో కలిసి పనిచేద్దామని అనుకున్నప్పటికీ చర్చలు విఫలం కావడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తాజాగా బీహార్ లో పాదయాత్ర చేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. పాదయాత్రలో ప్రజల అభిప్రాయాలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకొని త్వరలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తానని తెలిపారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ కు ఓ రాజకీయ నేత అంటే అమితమైన ఇష్టమట. ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. తనకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ అని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని సంస్థాగతంగా నిర్మించడం వెనుక ఆయన చేసిన కృషి అమోఘమని తెలిపాడు.

Prashant Kishor: కొత్త పార్టీ ఇప్పట్లో లేదు.. బీహార్‌లో 3వేల కి.మీల పాదయాత్ర చేస్తా

మరణించిన వారిలో మహాత్మా గాంధీ అంటే తనకు ఇష్టమంటూ తన అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. అంతేకాక ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో పట్టుదల ప్రతిఫలిస్తుందని ప్రతిపక్షాలు గ్రహించాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు. షాహీన్ బాగ్‌ను చూడండి, రైతుల నిరసనలను చూడండి. కేవలం కొందరు వ్యక్తులు ఏకమై సమస్య పరిష్కారం కోసం పట్టుదలతో పోరాటం చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారని, ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కరించే వరకు వచ్చిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు