Prashant Kishor: కొత్త పార్టీ ఇప్పట్లో లేదు.. బీహార్‌లో 3వేల కి.మీల పాదయాత్ర చేస్తా

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. నిన్నమొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెడుతారంటూ, దేశంలోని బీజేపీయేతర పార్టీలను కలుపుకొని కూటమి ఏర్పాటు చేస్తారంటూ..

Prashant Kishor: కొత్త పార్టీ ఇప్పట్లో లేదు.. బీహార్‌లో 3వేల కి.మీల పాదయాత్ర చేస్తా

Prasanth Kishor

Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. నిన్నమొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెడుతారంటూ, దేశంలోని బీజేపీయేతర పార్టీలను కలుపుకొని కూటమి ఏర్పాటు చేస్తారంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తన రాజకీయ ప్రయాణంపై పీకే స్పష్టత ఇచ్చారు. తాను కొత్త పార్టీ పెట్టడం లేదని తేల్చేశాడు. ప్రస్తుతానికి కొత్త పార్టీ ఆలోచన ఏమీలేదని, బీహార్ పురోభివృద్ధే తన లక్ష్యమంటూ కొత్తరాగం అందుకున్నాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.. అన్ని రాష్ట్రాల కంటే బీహార్ పూర్తిగా వెనుకబడి పోయిందని, బీహార్ పురోగతి కోసం తాను కృషి చేస్తానని తెలిపాడు. ఇందుకోసం 3వేల కి.మీల పాదయాత్ర చేస్తానని, పాదయాత్రలో ప్రజల అభిప్రాయాల మేరకు కొత్త పార్టీ అవసరం అనుకుంటే అప్పుడు కొత్త పార్టీ, దాని విధివిధానాలపై ఆలోచన చేస్తానని పీకే క్లారిటీ ఇచ్చారు.

Sonia – Prasanth kishore: మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన సోనియా – ప్రశాంత్ కిషోర్

ఇటీవల ట్విటర్‌లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజలను నేరుగా కలుసుకోవాల్సిన సమయం వచ్చిందని, అందుకు మార్గం జన సురాజ్ అంటూ పేర్కొన్నారు. ఈ కొత్త ప్రయాణం బీహార్ నుంచే ప్రారంభిస్తానంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తన భవిష్యత్ కార్యాచరణను తేటతెల్లం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి చెందిన 17వేల నుంచి 18వేల మందిని కలిసి మాట్లాడనున్నట్లు పీకే వివరించారు. వారి నుంచి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. ఇందుకోసం పాదయాత్ర చేపడుతున్నట్లు పీకే వెల్లడించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని పశ్చిమ చంపారన్ లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని, 3వేల కి.మీల పాదయత్ర చేస్తానని పీకే ఈ సందర్భంగా వెల్లడించారు. బీహార్ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉందని, లాలూ, నితీశ్ పాలనలో రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి సాధించలేదని పీకే విమర్శించారు.

Prasanth Kishore: మోడీ గారడీని నమ్మకండి: ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సూచన

‘జన సూరజ్’ కోసం రాబోయే మూడు నాలుగు నెలల్లో అందరినీ కలిసి మాట్లాడతానని, నా అభిప్రాయంతో కలిసొచ్చే వారికి నా ఉద్యమంలో చేర్చుకుంటానని పీకే పేర్కొన్నారు. నేను రాజకీయ పార్టీ పెడితే అది కేవలం ప్రశాంత్ కిషోర్ పార్టీ కాదని, అందరి పార్టీగా ఉంటుందని పీకే తెలిపాడు. నా శక్తి సామర్థ్యాలు అన్నిటినీ ఇందుకోసం ఉపయోగిస్తానని, మధ్యలో వదిలి ఎక్కడి వెళ్లనని ప్రశాంత్ కిషోర్ అన్నారు.