Prasanth Kishore: మోడీ గారడీని నమ్మకండి: ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సూచన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన "ఎన్నికల గారడీ" గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

Prasanth Kishore: మోడీ గారడీని నమ్మకండి: ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సూచన

Prasanth Kishor

Prasanth Kishore: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గారడీతోనే ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని విమర్శించారు. శుక్రవారం ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన “ఎన్నికల గారడీ” గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ ఫలితాలను చూసి ప్రతిపక్షాలు నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరం లేదన్న ప్రశాంత్ కిషోర్ దేశంలో అధికారం నిర్ణయించే ఎన్నికల్లో 2024లో జరగనున్నాయని ఇప్పటి రాష్ట్ర ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపకపోవచ్చని పేర్కొన్నారు.

Also read: Bandi Sanjay: అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యంతో ఉండాలి – బండి సంజయ్

“భారత్ లో అధికార మార్పడి కోసం 2024లో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు జరగదని సాహెబ్‌కు తెలుసు! ప్రతిపక్షాలపై ప్రజా వ్యతిరేకతపై నిర్ణయాత్మక మానసిక ప్రయోజనాన్ని ఏర్పరచుకోవడానికి రాష్ట్ర ఫలితాలను అద్దంలో చూపెడుతూ ఈ తెలివైన ప్రయత్నం. ఈ గారడీకి పడిపోకండి, తప్పుడు కథనంలో భాగం అవ్వకండి” అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. 2014లో ప్రశాంత్ కిషోర్ బీజేపీతో కలిసి ఎన్నికల వ్యూహరచన చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ తరుపున ప్రచార కార్యక్రమాలను ముందుండి నడిపించాడు. దీంతో అటు బీజేపీ కేంద్రంలో పాతుకుపోవడంతో పాటు.. ఇటు ప్రశాంత్ కిషోర్ సైతం రాజకీయ వ్యూహకర్తగా పేరుగడించారు. అనంతరం ఏపీలో వైసీపీ, బెంగాల్ లో టీఎంసీ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.

Also read: Sanjay Raut: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై పెదవి విరిచిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

ఇదిలాఉంటే గురువారం ఎన్నికల విజయోత్సవ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “ఈ ఎన్నికల విజయాన్ని 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సాధించిన విజయానికి, 2019లో సాధించిన విజయానికి ముడిపెట్టినందున, నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం తదుపరి సార్వత్రిక ఎన్నికల(2024 elections) తీర్పును కూడా స్పష్టం చేసిందనే విషయాన్ని రాజకీయ పండితులు గమనించాలంటూ” వ్యాఖ్యానించారు. ఇది పరోక్షంగా ఎన్నికల వ్యూహకర్తలనుద్దేశించి మోదీ చురకలంటించినట్లుగా ఉంది.

Also read: CM KCR : యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్