Prashant Kishor: బిహార్ ఇంకా వెనుకబడిన రాష్ట్రమే: పీకే

ముఖ్యమంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌ల ముప్పయ్యేళ్ల పాలన తర్వాత కూడా బిహార్ ఇంకా పేద, వెనుకబడిన రాష్ట్రంగానే ఉందన్నారు. శుక్రవారం ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్‌లో బిహార్ అభివృద్ధిపై స్పందించారు.

Prashant Kishor: బిహార్ ఇంకా వెనుకబడిన రాష్ట్రమే: పీకే

Prashant Kishor

Prashant Kishor: పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాల మధ్య బిహార్ వెనుకబాటుతనంపై స్పందించారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). ముఖ్యమంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌ల ముప్పయ్యేళ్ల పాలన తర్వాత కూడా బిహార్ ఇంకా పేద, వెనుకబడిన రాష్ట్రంగానే ఉందన్నారు. శుక్రవారం ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్‌లో బిహార్ అభివృద్ధిపై స్పందించారు. బిహార్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, ఆలోచన కావాలని, నిర్మాణాత్మకంగా కృషి చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Prashant Kishor: కొత్త పార్టీ ఇప్పట్లో లేదు.. బీహార్‌లో 3వేల కి.మీల పాదయాత్ర చేస్తా

ఇటీవలి కాలంలో బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే, నితీష్ కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రజలే అసలైన మాస్టర్లు అని, ప్రజా సమస్యల్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడే మంచి పాలన సాధ్యమవుతుందని పీకే ఇటీవల వ్యాఖ్యనించారు. పీకే చేసిన వ్యాఖ్యలను నితీష్ తిప్పికొట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై ఎవరి అభిప్రాయమో ముఖ్యం కాదని, పీకే అభిప్రాయాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నితీష్ వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై కూడా పీకే స్పందించారు. నితీష్ చెప్పినట్లుగా అభిప్రాయాలు ముఖ్యం కాదని, నిజాలే ముఖ్యమని పీకే అన్నారు.