మంచి చెయ్యాలని భావించిన వారికి చెడు జరగడం అంటుంటే వింటుంటాం కదా? అటువంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో అటవీప్రాంతంలో ఓ ఏనుగు పిల్ల రెండు భారీ బండరాళ్ల మధ్య ఇరుక్కుంది. అయితే బయటకు రాలేక ఆర్తనాధాలు చేస్తుంది. అటవీప్రాంతంలో ఎనుగు పిల్ల అరుపులు విన్న అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఏనుగుని రక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
జాగిరోడ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న సోనాకుచి కొండల ప్రాంతంలో ఏనుగు పిల్ల రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుపోగా స్థానికుల సాయంతో అటవీ అధాకారులు కష్టపడి ఏనుగును బయటకు తీశారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఏనుగు తల్లి పిల్ల ఏనుగును ఏదో చేస్తున్నారు అని భావించి అక్కడి వారిపై విరుచుకు పడింది.
అటవీ అధికారులు ఓ స్దానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ముందుగా ఏనుగు పిల్లను త్రాళ్లతో కట్టారు. తర్వాత అక్కడ ఉన్న కొంతమంది స్ధానికల సహాయంతో ఏనుగు పిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించామని అన్నారు. కొద్ది సేపటి తర్వాత ఏనుగు పిల్ల బయటకు వచ్చింది.
ఇంతలో ఏనుగు తల్లి తన పిల్లను వెతుకుతూ అటుగా వచ్చింది. అక్కడ ఏమి జరుగుతుందో తెలియక తన పిల్లను ఏమో చేస్తున్నారని వారి పై దాడికి ప్రయత్నించింది. దాంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు పెట్టారు. ఆ పరుగులో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా వాళ్లు బయటపడ్డారు.
#WATCH Assam: Forest officials & locals rescued an elephant calf that was stuck between boulders in Morigaon. One person was injured after the mother of the calf reached & chased away the people present there. (Source – Forest Department) (02.02.20) pic.twitter.com/FDRH2WYWdM
— ANI (@ANI) February 3, 2020