Tamilnadu Lockdown : మరికొన్ని సడలింపులతో జులై 19 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాడులో జూలై 19 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

Tamilnadu Lockdown : కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాడులో జూలై 19 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అయితే, హోటళ్లు, టీ షాపులు, బేకరీలు, రోడ్డు పక్కన నిర్వహించుకునే చిరుతిండ్ల షాపులు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకునేలా సడలింపులు ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే, ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం వంటి కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని పేర్కోంది.

అదే విధంగా.. పుదుచ్చేరితో రవాణా కార్యకలాపాలు ముఖ్యంగా బస్సు సర్వీసులు పునః ప్రారంభిస్తున్నట్లు తెలపింది. ఇక, పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, మద్యం దుకాణాలు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జూలు తదుపరి ఆదేశాల వరకు మూసే ఉంటాయని స్టాలిన్‌ సర్కారు స్పష్టం చేసింది. వివాహా కార్యక్రమాలకు గరిష్టంగా 50 మందితోనూ, అంత్యక్రియల కార్యక్రమాలకు 20మందికి అనుమతి ఇచ్చారు.

కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రంలో మిగతా కార్యకలాపాలు అన్నీ యధావిధిగా సాగుతాయని రాత్రి 8గంటలకల్లా అనుమతించిన దుకాణాలను మూసి వేయాలని సూచించారు. ఇతర కార్యకలాపాలు రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం శుక్రవారం నాటికి రాష్ట్రంలో 33,000 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మహామ్మారి ప్రారంభమైనప్పటినుంచి 24.46లక్షలమంది కోవిడ్ నుంచి కోలుకోగా 33,000 మందికి పైగా మరణించారు.

ట్రెండింగ్ వార్తలు