రత్న భండార్ మూడో గదిలో ఏముంది? ఎందుకు వెళ్లలేకపోయారు? అసలేం జరిగింది..

మిగిలిన రెండు గదుల్లో దేవుడికి రెగులర్ గా ఉపయోగించే బంగారాన్ని లాకర్ లో భద్రపరిచినట్లు తెలిపారు.

Puri Jagannath Temple Ratna Bhandar Reopoen : ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం నిధి లెక్కింపు మరింత ఆలస్యం కానుంది. భాండాగారం మూడో గది తాళం తెరుచుకోకపోవడంతో కట్టర్స్ సాయంతో తెరిచినట్లు అధికారులు తెలిపారు. గది లోపలకి వెళ్లకుండా కొత్త తాళం వేసినట్లు చెప్పారు. మూడో గదికి మళ్లీ సీల్ వేశారు. కమిటీ మీటింగ్ తర్వాత మళ్లీ గది తలుపులు తెరుస్తామని ప్రకటించారు. మిగిలిన రెండు గదుల్లో దేవుడికి రెగులర్ గా ఉపయోగించే బంగారాన్ని లాకర్ లో భద్రపరిచినట్లు తెలిపారు.

రత్న భాండాగారం మూడో గది తాళాలు పని చేయకపోవడంతో భారీ కట్టర్ మిషన్లతో తాళాలను ఆలయ సిబ్బంది కట్ చేశారు. కాగా, సమయాభావంతో గది తలుపులకు కొత్త తాళం అమర్చింది హైలెవెల్ కమిటీ. రేపు (జూలై 15) రథయాత్ర తిరుగు ప్రయాణం ఉండటంతో తాత్కాలికంగా రత్న భాండాగారం మదింపు కార్యక్రమం నిలిపివేశారు. మరోసారి హైలెవెల్ కమిటీ భేటీ తర్వాత సమయం నిర్ణయిస్తామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి అరవింద్ పాడి, హైలెవెల్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ విశ్వనాధ్ రధ్ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన తాళాన్ని జిల్లా ఖజానా కార్యాలయంలో అధికారులు భద్రపరచనున్నారు.

‘పాత తాళంతోనే మొదటి రెండు డోర్లు ఓపెన్ చేశాం. మూడో డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసినా ఓపెన్ కాలేదు. దాంతో భారీ కట్టర్ల సాయంతో లాక్ కట్ చేశాం. లాక్ కట్ చేసిన తర్వాత సమయం మించిపోయింది. దాంతో ఆ గది లోపలికి వెళ్లలేదు. వెంటనే తలుపులు వేసి కొత్త తాళం బిగించాం. ఆ తాళాన్ని భద్రపరిచాం’ అని అధికారులు తెలిపారు.

కాగా, 1978లో పూరీ జగన్నాథుడి రత్న భాండాగారాన్ని చివరిసారిగా తెరిచారు. 70 రోజుల పాటు సంపద లెక్కింపు జరిగింది. 128 కిలోల 454 బంగారు ఆభరణాలు, 221 కిలోల 293 వెండి ఆభరణాలు గుర్తించారు.

Also Read : రత్న భండార్ తెరిచే సమయంలో అనూహ్య ఘటన.. సొమ్మసిల్లి పడిపోయిన ఎస్పీ

 

 

ట్రెండింగ్ వార్తలు