Rahul Gandhi : వయనాడ్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రెండోసారి ఈ నియోకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు.

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రెండోసారి ఈ నియోకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. కల్పెట్ట నుంచి రోడ్ షోగా వచ్చి వయనాడ్ కలెక్టరేట్ లో రాహుల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ రోడ్ షో రాహుల్ వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు వేణుగోపాల్, దీపా దాస్, కన్హయ్య కుమార్ ఉన్నారు.

Also Read : కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతల ఆందోళన.. ఢిల్లీ హైకోర్టులో ఈడీ అరెస్ట్, కస్టడీపై విచారణ

దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఏడు విడతల్లో జరగనున్నాయి. రెండో విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇందులో కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంట్ నియోకవర్గాలు ఉండగా.. అందులో వయనాడ్ పార్లమెంట్ స్థానం కూడా ఉంది. ఇక్కడ ఏప్రిల్ 4వ తేదీతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. దీంతో బుధవారం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను మీ ఎంపీని కావడం గర్వకారణంగా ఉంది.. మీ అందరినీ నా చెల్లెలు ప్రియాంకలా భావిస్తానని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి నాకు ప్రేమ, అభిమానాన్ని అందించారు. మిమ్మల్ని నేను ఓటర్లుగా భావించను.. నా సొంత వ్యక్తుల్లా చూసుకుటానని రాహుల్ పేర్కొన్నారు.

Also Read : రాజ్యసభ నుంచి మన్మోహన్ సింగ్ రిటైర్.. 33 ఏళ్ల పాటు ఎంపీగా సేవలు

రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గం రెండోసారి బరిలోకి దిగుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్.. సమీప అభ్యర్థి పీపీ సునీర్ (సీపీఐ) పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఈసారి సీపీఐ తరపున అనీ రాజా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇవాళ ఆయనకు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు