కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతల ఆందోళన.. ఢిల్లీ హైకోర్టులో ఈడీ అరెస్ట్, కస్టడీపై విచారణ

లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి23న ఢిల్లీ హైకోర్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆశ్రయించిన విసయం తెలిసిందే.

కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతల ఆందోళన.. ఢిల్లీ హైకోర్టులో ఈడీ అరెస్ట్, కస్టడీపై విచారణ

Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. జైలులో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గారని, ఆరోగ్యం బాగాలేదంటూ ఆప్ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఆప్ మంత్రి అతిశీ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహ వ్యాధిగ్రస్థుడు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, అతను 24 గంటలూ దేశ సేవలో నిమగ్నమై ఉన్నాడు. అరెస్ట్ అయినప్పటికీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరువు 4.5 కిలోలు తగ్గింది. ఇదిచాలా ఆందోళనకరం. కేజ్రీవాల్ ను బీజేపీ జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యాన్ని ప్రమాదం పడేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కు ఏదైనా జరిగితే, దేశం మొత్తం కాదు.. దేవుడు కూడా బీజేపీని క్షమించడు అంటూ అతిశీ అన్నారు.

Also Read : హీరోయిన్లను బెదిరించారన్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. తాట తీస్తామంటూ హెచ్చరిక

లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి23న ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పిటీషన్ పై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఈడీ కస్టడీ చట్ట విరుద్ధం అని వెంటనే విడుదల చేయాలని పిటిషన్ లో కేజ్రీవాల్ పేపేర్కొన్నారు. అయితే, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్దమని ఈడీ సమర్ధించుకుంది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో సూత్రదారిగా కేజ్రీవాల్ ను ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని హైకోర్టులో రిప్లై పిల్ ఈడీ దాఖలు చేసింది.

Also Read : Nav Deep : డ్రగ్స్ కేసు గురించి మాట్లాడిన నవదీప్.. ప్రతిసారి నన్ను తీసుకెళ్తారు అంటూ..

కేజ్రీవాల్ కస్టడీని ప్రశ్నించే హక్కును వదులుకున్నారని, ఆయన కస్టడీ చట్ట విరుద్ధమని వాదించడానికి పిటిషనర్ అనుమతించబడరని ఈడీ తన వివరణలో పేర్కొంది. పీఎంఎల్‌ఎలోని సెక్షన్ 16 రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 యొక్క అన్ని విధానపరమైన అంశాలు ఖచ్చితంగా పాటించబడ్డాయని హైకోర్టుకు ఈడీ తెలిపింది. లిక్కర్ కుంభకోణం ద్వారా ఆప్ లబ్ది పొందిందని, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 45 కోట్లను ఖర్చు చేసిందని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.