హీరోయిన్లను బెదిరించారన్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. తాట తీస్తామంటూ హెచ్చరిక

సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

హీరోయిన్లను బెదిరించారన్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. తాట తీస్తామంటూ హెచ్చరిక

KTR : పల్లెల్లో సాగు నీళ్లు.. పట్టణాల్లో తాగునీరు లేక ప్రజలు అలమటిస్తున్నారు. ప్రతి పట్టణంలో బిందెలతో ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బుధవారం కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో సాగు, తాగునీటి ఎద్దడి నెలకొందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై దృష్టిపెట్టడం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి వాటర్ ట్యాప్ లపై దృష్టిపెట్టాలని కేటీఆర్ సూచించారు.

Also Read : Brs : చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు, రాళ్లతో ఇప్పుడు ఎవరిని కొట్టాలి- బీఆర్ఎస్ నేతలు ఫైర్

కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత ..
2023 ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పాం.. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అని. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే రాష్ట్రంలోని పల్లెల్లో సాగునీరు, పట్టణాల్లో తాగునీటి కొరత ఏర్పడింది. ప్రతి పట్టణంలో బిందెలతో ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల గొంతు ఎండుతున్నాయి.. ఇదేమని ప్రశ్నిస్తే.. రేవంత్ రెడ్డి బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన వనరులను ఢిల్లీకి తరలించడంలో ఉన్న శ్రద్ద జల వనరులను తెలంగాణకు తేవడంలో కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. ట్యాంకర్ల దందాలు హైదరాబాద్ లో మళ్లీ మొదలయ్యాయి. ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచి నీళ్ల ట్యాంకర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు దప్పికతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ఎలా ఓడగొట్టాలి.. ఎలా బెదిరించాలి.. ఢిల్లీకి డబ్బు సూట్ కేసులు ఎలా తరలించాలనే విషయాలపై యావతప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. ఇదంతా కరువు వల్ల వచ్చిందంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు.. కరువు వల్ల వచ్చిన కొరత కాదు.. కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత ఇది అంటూ కేటీఆర్ అన్నారు.

Also Read : CM Revanth Reddy : బీఆర్ఎస్ ఖాతాలో 1500కోట్లు ఉన్నాయి.. రైతులకు ఓ 100కోట్లు సాయం చేయొచ్చు కదా- సీఎం రేవంత్ రెడ్డి

ఎవర్నీ వదలం.. తాటతీస్తాం ..
ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినో హీరోయిన్లను బెదిరించానని నాపై ఓ మంత్రి మాట్లాడుతున్నాడు.. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ ఆరోపణలకు నేనుభయ పడను. ఇలాగే అర్ధంపర్ధంలేని ఆరోపణలు చేస్తే ఎవర్నీ వదిలిపెట్టము. తాట తీస్తాం అంటూ కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ వివరాలు అన్నీ రేవంత్ రెడ్డికి పంపిస్తామని కేటీఆర్ అన్నారు.

Also Read : CM Revanth Reddy : బీఆర్ఎస్ ఖాతాలో 1500కోట్లు ఉన్నాయి.. రైతులకు ఓ 100కోట్లు సాయం చేయొచ్చు కదా- సీఎం రేవంత్ రెడ్డి

దానం, కడియంపై కోర్టుకెళ్తాం ..
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పీకర్ కు మార్చి 18న ఫిర్యాదు చేశాం. ఆదివారం వరకు వేచిచూస్తాం.. అప్పటి వరకు నిర్ణయం రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కేటీఆర్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది. ఒక పార్టీ గుర్తు మీద పోటీచేసి గెలిచి.. మళ్లీ వేరే పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. కచ్చితంగా కడియం శ్రీహరి, దానంపై కోర్టుకు వెళ్తామని కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని అన్నారు. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారు. ఆయనకు నా అభినందనలు అని కేటీఆర్ అన్నారు.