వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం.. భారీగా తగ్గిన మెజారిటీ

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌స‌భ‌ స్థానం నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు.

Narendra Modi Hatrick: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌స‌భ‌ స్థానం నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్య్థర్థి అజయ్ రాయ్‌పై ఆయన గెలుపొందారు. అయితే ఈసారి ఆయనకు మెజారిటీ భారీగా తగ్గింది. 152513 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి అయిన అజయ్ రాయ్‌ను ఓడించారు. మోదీకి 612970 ఓట్లు రాగా, అజయ్ రాయ్‌ 460457 ఓట్లు దక్కించుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అథర్ జమాల్ లారీకి 33766 ఓట్లు వచ్చాయి. యుగ తులసి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన.. హైదరాబాద్‌కు చెందిన కొలిశెట్టి శివకుమార్ 5750 ఓట్లు పొందారు.

గత రెండు ఎన్నికలతో మోదీ మెజారిటీ భారీగా తగ్గింది. 2019 ఎన్నికల్లో ఆయన 479,505 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 371,784 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి చేదుఫలితం ఎదురైంది. గత ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన కమలం పార్టీ ఈసారి 33 సీట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మెజారిటీ కూడా తగ్గిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు