Lok sabha Elections 2024 : రేపే సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్.. బరిలో ప్రముఖులు

దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Lok sabha Elections 2024 1st Phase : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతల ఎన్నికల పోలింగ్ రేపు (శుక్రవారం) జరగనుంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
2019లో 102 నియోజకవర్గాల్లో 45 స్థానాల్లో యుపీఎ విజయం సాధించగా.. 41 నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థులు
విజయం సాధించారు.

Also Read : లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌కు మరో బిగ్‌షాక్‌.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

పోలింగ్ జరిగే రాష్ట్రాలివే..
తొలి విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గ‌ఢ్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్. మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్- నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 102 లోక్ సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాల్లో 50స్థానాలకు పోలింగ్ జరగనుంది. పది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. అదేవిధంగా సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
జరగనుంది.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ.. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

– తొలిదశ పోలింగ్‌లో మొత్తం ఎనిమిది మంది మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ గవర్నర్‌ పోటీ పడుతున్నారు.
– నాగ్‌పుర్‌ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, అరుణాచల్‌ వెస్ట్‌ నుంచి కిరణ్ రిజిజు, డిబ్రూగఢ్‌ స్థానం నుంచి సర్బానంద సోనోవాల్‌, అర్జున్‌ మేఘవాల్‌, ఎల్‌.మురుగన్‌
.- త్రిపురలో రెండు స్థానాలుండగా, వెస్ట్‌ త్రిపుర నుంచి మాజీ సీఎం బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ పోటీ చేస్తున్నారు.
– చెన్నైసౌత్‌ నియోజకవర్గం నుంచి తమిళిసై సౌందరరాజన్‌ పోటీ చేస్తున్నారు.
– శివగంగ నియోజకవర్గం నుంచి కార్తి చిదంబరం
– కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి కె.అన్నామలై.
– సెంట్రల్ చెన్నై నియోజకవర్గం నుంచి దయానిధి మారన్.
– చింద్వారా నియోజకవర్గం నుంచి నకుల్ నాథ్.
– సహారాన్ పూర్ నియోజకవర్గం నుంచి ఇమ్రాన్ మసూద్ తో పాటు పలువురు ప్రముఖులుసైతం శుక్రవారం మొదటి విడత జరిగే పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు