Reserved Berths For Women : రైళ్లలో సుదూర ప్రయాణాలు చేసే మహిళలకు ప్రత్యేక బెర్త్‌లు!

రైల్లో దూర ప్రయాణాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అందులోనూ మహిళలు అయితే వారి అవస్థలు చెప్పన్కర్లేదు. మహిళా ప్రయాణికులు ప్రయాణ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Reserved Berths For Women : రైల్లో దూర ప్రయాణాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అందులోనూ మహిళలు అయితే వారి అవస్థలు చెప్పన్కర్లేదు. కొన్నిసార్లు రైల్లో సీట్లు, బెర్తులు దొరకవు. మహిళా ప్రయాణికులు ప్రయాణ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇకపై అలాంటి ఇబ్బందులు మహిళలకు ఎదురుకాకుండా ఉండేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. రైల్లో సుదూర ప్రయాణాలు చేసే మహిళల కోసం రిజర్వేషన్లు తీసుకొస్తోంది.

అంటే.. వారు కోరుకున్న చోట సీట్లు, బెర్తులను రైల్వే శాఖ కేటాయించనుంది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనలో వెల్లడించారు. దూర ప్రాంతాలకు రైలు ప్రయాణాలు చేసే మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రిజర్వడ్ బెర్త్స్ విధానాన్ని తీసుకొస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లు, మెయిల్ రైళ్లు, స్లిపర్ క్లాసుల్లో 6 బెర్త్‌లు కేటాయించనుంది రైల్వే శాఖ. గరీబ్ రథ్, రాజధాని, దురంతో, ఫుల్ ఏసీ ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో కూడా 3 ఏసీ క్లాసుల్లో 6 బెర్త్‌లు మహిళల కోసం రిజర్వర్డ్ చేయనున్నట్టు రైల్వే మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా రైల్లో ప్రయాణించే సమయంలో వారికి రిజర్వేషన్ కోటా వర్తింపజేయనున్నట్టు తెలిపారు.

ప్రతి రైల్వే స్లీపర్ కోచ్.. 6 నుంచి 7 వరకు లోయర్ బెర్త్ లు, 3 ఏసీ కోచ్ ల్లో 4 నుంచి 5 లోయర్ బెర్త్‌లు, 2 ఏసీ కోచ్‌లలో 3 నుంచి 4 బెర్త్‌ల వరకు సీనియర్ సిటిజన్‌లు, 45ఏళ్ల వయస్సు పైబడిన మహిళలు, గర్భీణులకు బెర్త్ లను రిజర్వ్ చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో కోచ్‌ల సంఖ్య ఆధారంగా సీట్ల రిజర్వడ్ కోటా నిర్ణయించనున్నట్టు చెప్పారు.

Read Also : Paritala Sriram : శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా… పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు